చిరుకి సెంటిమెంట్ ట‌చ్ ఇచ్చిన కృష్ణవంశీ

చిరంజీవి 150వ చిత్రం ప్రస్తావ‌న‌కు వ‌చ్చిన తొలి రోజుల్లో ద‌ర్శకుడిగా కృష్ణవంశీ పేరు కూడా వినిపించింది. కృష్ణవంశీ కూడా చిరంజీవితో సినిమ చేయ‌డానికి చాలా ఉత్సాహం చూపించారు. వందేమాత‌రం అనే క‌థ కూడా రాసుకొన్నారు.…

చిరంజీవి 150వ చిత్రం ప్రస్తావ‌న‌కు వ‌చ్చిన తొలి రోజుల్లో ద‌ర్శకుడిగా కృష్ణవంశీ పేరు కూడా వినిపించింది. కృష్ణవంశీ కూడా చిరంజీవితో సినిమ చేయ‌డానికి చాలా ఉత్సాహం చూపించారు. వందేమాత‌రం అనే క‌థ కూడా రాసుకొన్నారు. ఆ క‌థ‌ని.. చిరునే క‌రెక్ట్ అన్నది కృష్ణవంశీ న‌మ్మకం. ఓసారి ఈ క‌థ‌ని నేరేట్ చేశాడు కూడా. అయితే ఆ ప్రాజెక్ట్ ప‌క్కకు వెళ్లిపోయింది. 

ఇప్పుడు కాక‌పోయినా ఈ సినిమా ఎప్పుడో ఒక‌ప్పుడు ఉండ‌క త‌ప్పద‌న్నది ప‌రిశ్రమ వ‌ర్గాల అభిప్రాయం. ఇప్పుడు కృష్ణవంశీ కూడా ఈ మాట‌ల‌కు ఊతం ఇస్తున్నాడు. మ‌రోసారి వందేమాత‌రం ప్రస్తావ‌న తీసుకొచ్చాడు. “వందేమాత‌రం నా డ్రీమ్ సినిమా. త‌ప్పకుండా చేస్తా. ఆ సినిమా చేసే చ‌చ్చిపోతా. అది చేయ‌కుండా మాత్రం వెళ్లను“ అని ఎమోష‌న‌ల్ టచ్‌కూడా ఇచ్చాడు. 

ఈ మాట‌కైనా చిరు బౌల్డ్ అవుతాడేమో చూడాలి. ఇప్పుడు అవ్వక‌పోయినా చ‌ర‌ణ్ సినిమాని కృష్ణవంశీ సూప‌ర్ హిట్ చేస్తే చిరు 151వ సినిమా… వందేమాత‌రం అవ్వడం ఖాయం.