చ‌ర‌ణ్ డాడీగా నాగ్‌?

మ‌ల్టీస్టార‌ర్‌గా మొద‌లైన రామ్‌చర‌ణ్ – కృష్ణవంశీ సినిమా సింగిల్ స్టార్ తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది. శ్రీ‌కాంత్‌వ‌చ్చి చేరినా స్టార్ వాల్యూ లేక‌పోవ‌డంతో ఒక హీరో సినిమాగానే చ‌లామ‌ణి అవుతోంది. అయితే.. ఇప్పుడు ఓ షాకింగ్…

మ‌ల్టీస్టార‌ర్‌గా మొద‌లైన రామ్‌చర‌ణ్ – కృష్ణవంశీ సినిమా సింగిల్ స్టార్ తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది. శ్రీ‌కాంత్‌వ‌చ్చి చేరినా స్టార్ వాల్యూ లేక‌పోవ‌డంతో ఒక హీరో సినిమాగానే చ‌లామ‌ణి అవుతోంది. అయితే.. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్‌. ఈ సినిమాలో మ‌రో హీరో ఉన్నాడు. శ్రీ‌కాంత్‌ని తీసుకొన్నది వెంక‌టేష్ స్థానంలో కాద‌ని తేలింది. 

ఈ సినిమాలో మ‌రో స్టార్ఉన్నాడ‌ట‌. ఆ స్టార్ నాగార్జునే అని టాక్‌. వెంకీ స్థానంలో నాగార్జున‌ని తీసుకొంటే ఎలా ఉంటుంది??  అని చిత్రబృందం ఆలోచిస్తోంది. నాగార్జున కాక‌పోయినా ఎవ‌రో ఓ పేరున్న స్టార్ హీరో ఉండ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అదీ… చ‌ర‌ణ్ నాన్న పాత్రలో. ఒక‌వేళ నాగ్ ఒప్పుకోక‌పోతే బాలీవుడ్ క‌థానాయ‌కుడిని తీసుకురావాల‌న్న ప్రయ‌త్నాల్లో ఉంది చిత్రబృందం. 

నాగ్ – కృష్ణవంశీ మ‌ధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా, కొత్తత‌ర‌హా క‌థ‌లంటే నాగ్‌కి ఉన్న ప్రేమ దృష్ట్యా ఈ పాత్ర నాగార్జున త‌ప్పకుండా చేస్తార‌ని చిత్రబృందం న‌మ్ముతోంది. ఒక‌వేళ నాగ్ గ‌నుక ఒప్పుకొంటే.. ఈ సినిమాకి స‌రికొత్త లుక్ రావ‌డం ఖాయం.