గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం ఒకటే. ఆంధ్ర సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు. టికెట్ ల రేట్ల విషయం ఆయనకు ఎలా కన్వే చేయాలో తెలియడం లేదు.
మంత్రుల వల్ల కావడం లేదు. సలహాదారుల వల్ల కావడం లేదు. ఆఖరికి ఇప్పటికి ఓ చిన్న భరోసా కుదిరింది. వచ్చే వారంలో సినిమా ప్రముఖులు కొంతమందికి సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మరీ ఎక్కువ మంది కాకుండా, ఒకరిద్దరు హీరోలు, ఒకరిద్దరు దర్శకులు, ఒకరిద్దరు నిర్మాతలు ఇలా చిన్న బృందాన్ని సిద్దం కమ్మని సిఎమ్ పేషీ నుంచి వర్తమానం అందినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఇలాగే వర్తమానం వస్తే నాగ్, చిరు, రాజమౌళి, సురేష్ బాబు వగైరాలు వెళ్లారు. అప్పుడు విమర్శలు వినిపించాయి. అందరికీ చెప్పకుండా, వాళ్లలో వాళ్లే కూడబలుక్కుని వెళ్లిపోయారని విమర్శలు వినిపించాయి.
మరి ఇప్పుడు ఇద్దరు హీరోలు అంటే చిరు-నాగ్ నే వెళ్తారో? బాలయ్యను లేదా మోహన్ బాబును తీసుకెళ్తారో? అలాగే దర్శకులు అంటే రాజమౌళి ఈసారి వెళ్లకపోవచ్చు. కొరటాల శివ పేరు వినిపిస్తోంది. దర్శకుడు మహిని కూడా తీసుకెళ్తే బెటర్ అనే ఒపీనియన్లు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఎవరు వెళ్లినా, వచ్చేవారం సిఎమ్ అపాయింట్ మెంట్ కనుక లభిస్తే టికెట్ రేట్ల సమస్య కొలిక్కి వచ్చేసినట్లే.