చిరంజీవితో తను రూపొందించే సినిమాలో ఓ ప్రయోగం చేయాలనుకున్నారు దర్వకుడు కొరటాల శివ. అదేంటంటే సినిమాలో వచ్చే చిరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయనకు యంగ్ గా చూపించాలని కిందా మీదా పడడం కన్నా, రామ్ చరణ్ ను ఆ పాత్రలో చూపించడం. ఎందుకంటే తండ్రీ కొడుకులు. ఆ మాత్రం పోలికల వుంటాయి. అయినా ముఫై ఏళ్లలో వున్నట్లు చాలా మంది అరవై ఏళ్లకు వుండరు. అందువల్ల రామ్ చరణ్ ను వాడడం ద్వారా సినిమాకు గ్లామర్ యాడ్ చేసినట్లు వుంటుంది, ప్రయోగంలా వుంటుంది అనుకున్నారు. అలాగే ఫిక్స్ అయ్యారు.
కానీ ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కారణంగా సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ వరకు విడుదల చేయకుండా వుంచాల్సిన పరిస్థితి. దాంతో ఆ సినిమాను 2021 జనవరి తరువాతనే థియేటర్లలోకి తీసుకురావాల్సి వుంది. ఈ విషయమై కిందా మీదా చర్చలు సాగుతున్నాయి. రాజమౌళి ని ఒప్పించే ప్రయత్నం కూడా జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో అసలు రామ్ చరణ్ ను సినిమాలోంచి తీసేసి, ఆ పాత్రకు మహేష్ ను తీసుకుంటారని, ఈ మేరకు కొరటాల శివ అప్పుడే మహేష్ కు నెరేషన్ కూడా ఇచ్చేసాడని గ్యాసిప్ లు వండేస్తున్నారు. కానీ చిరు ఫ్లాష్ బ్యాక్ పాత్రలో మహేష్ ఎలా నప్పుతాడు? ఈ ప్రాజెక్టులో మహేష్ చేరితే మరో ముఫై, నలభై కోట్లు భారం పడుతుంది. అది ఎలా వర్కవుట్ అవుతుంది.
అంతా బుస్ అని, చరణ్ నే ఆ పాత్ర చేస్తున్నారని అన్నది యూనిట్ వర్గాల బోగట్టా.