చిరు..సుక్కు..తగ్గేదేలే

ఏస్ డైరక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరు కలిసి ఓ యాడ్ అందిస్తే ఎలా వుంటుంది. పక్కా సినిమాటిక్ గా వుండదూ.  Advertisement ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చిరుతో సుక్కూ చేసిన యాడ్…

ఏస్ డైరక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరు కలిసి ఓ యాడ్ అందిస్తే ఎలా వుంటుంది. పక్కా సినిమాటిక్ గా వుండదూ. 

ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చిరుతో సుక్కూ చేసిన యాడ్ కూడా అలాగే వుంది. భార్యకు సర్ప్రయిజ్ ఇవ్వడానికి చిరు ఇంటి స్థలం కొనుగోలు చేయడం, దాన్ని ఏదో అక్రమ సంబంధం వ్యవహారంలా ప్రొజెక్ట్ చేయడం, చివరకు నిజం తెలిసి ఆ భార్య భర్త గుండెలపై ఒదిగి పోవడం ఇదీ కాన్సెప్ట్.

ఓ రియల్ ఎస్టేట్ ఉద్యోగిని ముందుగా క్లయింట్ ను ఏంటి లేటూ అంటే అలాగే క్లయింట్ భార్యను తెలిసిపోయిందా? అంటూ ఏకవచనంలో సంబోధించడం. మళ్లీ అదే ఎంప్లాయి 'మేడం' అంటూ మాట మార్చడం. ఏదో కిట్టింపు వ్యవహారంగా అనిపించింది.

అయితే చిరు తన స్టయిల్ లో 'మేనేజ్ చేసా' అనడం భలేగా వుంది. ఆఖరికి ప్రకటనలకు కూడా విఎఫ్ఎక్స్ వర్క్ లు చేయాల్సి వస్తోంది. చిరును నిత్యం ఏదో ఒక ఫంక్షన్ లో చూస్తూనే వున్నాం. ఎలా వుంటారో తెలుస్తోనే వుంది. ఆయనను బాగా సన్నంగా మారినట్లు చూపించడం ఎందుకో?

మొత్తానికి చిరు చేసిన యాడ్ కాబట్టి రీచ్ బాగానే వుంటుంది చిరు..సుక్కూ కాంబినేషన్ కనుక ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది.