నీటిలో గేదెను పెట్టి, బేరాలు సాగిస్తే వచ్చే రేటు వేరు. బయటకు తీసాక, కొనే పార్టీ దాన్ని చూస్తే వచ్చే రేటు వేరుగా వుంటుంది. సినిమా వ్యాపారం అలాగే వుంటుంది. అన్నీ చెబుతారు కానీ సినిమా చూపించి అమ్మడం అన్నది చాలా రేర్ గా వుంటుంది. మరీ అద్భుతమైన కాన్ఫిడెన్స్ వుంటే తప్ప అలా చూపించి అమ్మడం జరగదు.
విడుదల కావాల్సిన ఓ సినిమా విషయంలో ఇలాంటి గమ్మత్తు ఒకటి జరిగినట్లు తెలుస్తోంది. విడుదల కావాల్సిన ఓ మల్టీస్టారర్ సినిమాకు డిజిటల్ రైట్స్ ను ఓ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ రెండు కోట్లు ఆఫర్ చేసింది. ఇదేంటి? ఇంత తక్కువా.. తమ సినిమా ఇంత గొప్ప అంత గొప్ప, ఇంకా ఎక్కువ వస్తుంది అనడంతో, 'సినిమా చూపించండి చెబుతాం' అన్నారని తెలుస్తోంది.
దాంతో ఆ కంపెనీ ప్రతినిధులకు రఫ్ కాపీ చూపించినట్లు బోగట్టా. అదిచూసి, వాళ్లు అప్పటి వరకు ఇస్తామన్న రెండుకోట్లు ఇస్తామని చెప్పకపోగా, కోటి రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అవాక్కయిన ఆ సినిమా కీలక బాధ్యులు, ప్రస్తుతానికి వ్యవహారాన్ని అబేయన్స్ లో పెట్టారు.
చాలా తెలుగు సినిమాల వ్యవహారాలు ఇలాగే వుంటాయి. స్టార్ కాస్ట్ చూపించి, భారీతనం చూపించి అమ్మేయడమే. చూపించి అమ్ముతాం అంటే తేడా కొట్టేస్తుంది వ్యవహారం.