చౌదరికి ముందు తెలీదా?

ఆరు నూరైనా ‘రేయ్‌’ సినిమాని మే 9న రిలీజ్‌ చేసి తీరతానని వైవిఎస్‌ చౌదరి ప్రకటించాడు. అయితే ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేసారు. మే 9న రాజకీయంగా వాతావరణం వేడిగా ఉంటుందనేది ఈ…

ఆరు నూరైనా ‘రేయ్‌’ సినిమాని మే 9న రిలీజ్‌ చేసి తీరతానని వైవిఎస్‌ చౌదరి ప్రకటించాడు. అయితే ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేసారు. మే 9న రాజకీయంగా వాతావరణం వేడిగా ఉంటుందనేది ఈ వాయిదా కారణమట. ఎలక్షన్స్‌ పూర్తయి అందరూ ఉత్కంఠగా రిజల్ట్స్‌ కోసం చూస్తుంటారని, మీడియా కూడా ఫోకస్‌ అంతా పాలిటిక్స్‌పై పెడుతుందని దీనిని వాయిదా వేసారట. 

అయితే ఈ సంగతి ముందే తెలిసినా కానీ మే 9న విడుదల చేసి తీరాలని అనుకుని, ఇప్పుడెందుకు వాయిదా వేసినట్టు? రిలీజ్‌కి రెడీగా ఉన్నా కానీ మనం సినిమాని పీక్‌ సమ్మర్‌ వదిలేసి మే 23న విడుదల చేస్తున్నారంటే కారణం ఇది కాదా? మిగతా వాళ్లందరికీ తెలిసినది వైవిఎస్‌ చౌదరికి ఆలస్యంగా తెలిసిందా? 

ఏవో సాకులు చెబుతున్నా కానీ రేయ్‌ చిత్రానికి బిజినెస్‌ జరగకపోవడమే విడుదల వాయిదా పడడానికి కారణమని తెలిసింది. విడుదల తేదీ ప్రకటిస్తే బయ్యర్లు వస్తారని అనుకుంటే ఇంతవరకు దీనిని కొనేందుకు ఎవరూ ముందుకి రాకపోవడంతో మరికొన్ని రోజులు వేచి చూసి నిర్ణయం తీసుకోవాలని చౌదరి భావిస్తున్నాడట. అందుకే ఈ చిత్రం వాయిదా పడిరదనేది ఫిలిం నగర్‌ ఖబర్‌.