సినిమా లేకపోయినా రెండు కోట్లు వదిలాయి

ప్రాజెక్టు అటకెక్కేసింది కానీ, ఖర్చుమాత్రం తప్పలేదు. దాదాపు రెండుకోట్లు వృధాగా పోయాయట. ఇదంతా రామ్-ప్రవీణ్ సత్తారు సినిమా సంగతే. ఈ సినిమాను ఆపేసిన వైనం తెలిసిందే. Advertisement అయితే అంతకు ముందు ఈసినిమా కోసం,…

ప్రాజెక్టు అటకెక్కేసింది కానీ, ఖర్చుమాత్రం తప్పలేదు. దాదాపు రెండుకోట్లు వృధాగా పోయాయట. ఇదంతా రామ్-ప్రవీణ్ సత్తారు సినిమా సంగతే. ఈ సినిమాను ఆపేసిన వైనం తెలిసిందే.

అయితే అంతకు ముందు ఈసినిమా కోసం, కాస్టింగ్ పనులు, స్క్రిప్ట్ పనులు, షూటింగ్ స్థలాల పరిశీలన, వీసాలు, కొంతమందిని దుబాయ్ దాకా తీసుకెళ్లి వెనక్కు రప్పించడం ఇలాంటి వాటి వల్ల దగ్గర దగ్గర రెండు కోట్ల వరకు నిర్మాత స్రవంతి రవికిషోర్ కు పోయిందట.

ఈ ప్రాజెక్టు వాస్తవానికి వేరే నిర్మాతది. ఆయన ఆదిలోనే బడ్జెట్ ప్లానింగ్ అదీ చూసి తన వల్ల కాదన్నారు. అప్పుడు స్రవంతి రవికిషోర్ తన తలకెత్తుకున్నారు. నలభై కోట్ల బడ్జెట్ ప్లానింగ్ ఇచ్చారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. పోనీ ధైర్యం చేద్దాం అనుకున్నా, అక్కడితో ఆగుతుందా? అన్న అనుమానం కలిగింది.

ప్రవీణ్ సత్తారు గరుడవేగ విషయంలో కూడా ఇలాగే జరిగిందన్న గుసగుసలు వున్నాయి. దాంతో, పోయిన ఖర్చులు పోతే పోయాయి, ప్రాజెక్ట్ వద్దనుకున్నారు.

రెండుకోట్లు పోతే పోయాయని, సినిమా ప్రవీణ్ సత్తారు చేతిలో పెడితే, బడ్జెట్ తేడాకొడితే కనీసం పదికోట్లు పోయే ప్రమాదం తప్పిందని అంటున్నారట స్రవంతి రవికిషోర్. గుడ్డిలో మెల్ల అంటే ఇదేనేమో?