శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలియానా, సునీల్ వంటి కాస్టింగ్ వుంది. ఈ సినిమా ఎక్కువగా అమెరికాలో షూటింగ్ జరుపుకోవాల్సి వుంది. అయితే ముందుగా కొన్ని రోజులు ఇక్కడ షూట్ చేసారు.
ఆపైన అమెరికా వెళ్లాల్సిందే యూనిట్. కానీ వీసాలు ఆలస్యమయ్యేలా వుందట. దాంతో మరో పది హేను రోజులు ఇక్కడే కొంత షెడ్యూలు చేసి, ఆ తరువాత అమెరికా వెళ్లాలని డిసైడ్ అయ్యారట. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది యూనిట్.
ఇదిలా వుంటే ఇటీవల నేలటికెట్ డిజాస్టర్ కావడం, శ్రీను వైట్ల ఫామ్ లో లేకపోవడంతో, ఇప్పుడు ఈ సినిమా ఏలా వస్తోందో? రవితేజ లుక్ ఎలా వుందో అని, ఇప్పటి వరకు తీసిన రష్ మొత్తం ఓసారి వేసుకుని మరీ చూసుకున్నారట నిర్మాతలు.
కామెడీ బాగా పండడం, శ్రీను వైట్ల మళ్లీ మనసు పెట్టారని ఫీల్ రావడం, పైగా రవితేజ బాగా యాక్టివ్ గా కనిపించడంతో ఫరవాలేదని ముందుకు వెళ్తున్నారట. అదీ విషయం.