తేజు కోసం చిరు.. సుధీర్ కోసం మహేష్?

తమ తమ బంధువుల సినిమాలను తాము ప్రమోట్ చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. శనివారం జరిగే తేజ్ ఐ లవ్ యూ…

తమ తమ బంధువుల సినిమాలను తాము ప్రమోట్ చేయకపోతే ఎవరు చేస్తారు? అందుకే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. శనివారం జరిగే తేజ్ ఐ లవ్ యూ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవినే ముఖ్య అతిథి.

అయితే అదే రోజు శ్రీనివాసరెడ్డి నటించిన జంబలకడిపంబ సినిమా ట్రయిలర్ రిలీజ్ వుంది. కానీ ముఖ్య అతిధి కరువు. తనకు అనేక మంచి పాత్రలు ఇచ్చిన త్రివిక్రమ్ ను శ్రీనివాసరెడ్డి అడిగితే, హిట్ కొట్టి కానీ, పబ్లిక్ ఫంక్షన్ లకు రాను అంటున్నారు ఆయన. కళ్యాణ్ రామ్ తో మాంచి సినిమాలు చేసాడు. అడుగుదాం అంటే, అదే కళ్యాణ్ రామ్ సినిమా కూడా 14న విడుదలవుతోంది.

దాంతో జంబలకిడి పంబ ఫంక్షన్ కు సరైన చీఫ్ గెస్ట్ దొరకడం లేదు. ఇక సుధీర్ బాబు సమ్మోహనం కూడా వుంది. కానీ మహేష్ విదేశాల్లో వున్నారు. ఆయన ఇవ్వాళో, రేపో వస్తారని తెలుస్తోంది. కానీ వచ్చిన వెంటనే ఫంక్షన్ కు వచ్చే మూడు వుంటుందో? వుండదో? అనుమానం. అందువల్ల సమ్మోహనం ఫంక్షన్ కు కూడా చీఫ్ గెస్ట్ ను వెదుక్కోవాల్సి వుంది.