కార్తీ, విశాల్.. ఇప్పుడు రజనీ?

ఒకప్పుడు టాలీవుడ్ లో తమిళ హీరోల సినిమాలు అంటే పిచ్చ క్రేజ్. అజిత్, సూర్య, రజనీ, కార్తీ, విశాల్, విజయ్ ల సినిమాలు అంటే స్ట్రయిట్ సినిమాలతో సమానంగా పోటీ పడేవి. వసూళ్లు అలాగే…

ఒకప్పుడు టాలీవుడ్ లో తమిళ హీరోల సినిమాలు అంటే పిచ్చ క్రేజ్. అజిత్, సూర్య, రజనీ, కార్తీ, విశాల్, విజయ్ ల సినిమాలు అంటే స్ట్రయిట్ సినిమాలతో సమానంగా పోటీ పడేవి. వసూళ్లు అలాగే వుండేవి. రేట్లు అలాగే వుండేవి. కానీ ఈ జోరును నమ్ముకుని, చాలా మంది ప్రొడ్యూసర్లు పోటీకి వెళ్లి మరీ హక్కులు కొనుక్కుని కుదేలయిపోయారు. ఆ తరువాత ఆ హీరోల అందరి మార్కెట్ అలా అలా డౌన్ అయిపోతూ వచ్చింది.

అయితే ఊపిరి, ఆ తరువాత వచ్చిన ఖాకీ సినిమాలు మళ్లీ కార్తీకి కాస్త పూర్వ వైభవం తెచ్చాయి. మంచి సినిమా పడితే కార్తీ సినిమాలు కలెక్షన్లు కురిపిస్తాయని చెప్పాయి. ఖాకీ సినిమా స్ట్రయిట్ సినిమాలతో పోటీ పడి మరీ ఆడేసింది. ఆ విధంగా కార్తీ మళ్లీ సెటిల్ అయినట్లే అనుకోవాలి.

ఇక విశాల్ సినిమా డిటెక్టివ్ మంచి కలెక్షన్ల రాబట్టుకోకపోయినా, ఓకె అనిపించుకుంది. అభిమన్యుడు సినిమా పెట్టుబడికి నాలుగింతలు రాబట్టే దిశగా సాగుతోంది. ఇప్పటికే తొమ్మిది కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో తరువాత వచ్చే పందెంకోడికి ఇమేజ్ పెరుగుతుంది.

ఇక ఇప్పుడు రజనీ వస్తున్నాడు. లింగా, కబాలి ఇలా చాలా రజనీ సినిమాలు తెలుగులో ఢమాల్ మన్నాయి. ఇప్పుడు కాలా కనుక ఆడితే, కార్తీ, విశాల్ మాదిరిగా రజనీ కూడా బౌన్స్ బ్యాక్ అయినట్లు అవుతుంది. మరో కొన్ని గంటల్లో ఏ విషయం తెలిసిపోతుంది.