మహేష్-వంశీ పైడిపల్లి సినిమా షూట్ ఓపెనింగ్ దగ్గరకు వచ్చింది. డెహ్రాడూన్ లో షూట్ స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఈ సినిమాకు వంశీ పైడిపల్లి అందిస్తున్న స్క్రిప్ట్ కు సంబంధించి చెన్నయ్ లో కోర్టు స్టే వుంది.
ఈ స్క్రిప్ట్ ను మరే సినిమా నిర్మాణానికి వాడకూడదు. కావాలంటే వేరే స్క్రిప్ట్ తో సినిమా చేసుకోవచ్చు. కానీ దిల్ రాజు-మహేష్ బాబు-వంశీ పైడిపల్లి తెగించి షూట్ కు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
స్టేకు వ్యతిరేకంగా ఏ మాత్రం వున్నా పివిపి కనుక కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు దిశగా కానీ వెళ్తే, వ్యవహారం వేరుగా వుంటుందని తెలుస్తోంది. అయితే దిల్ రాజు అండ్ కో ఆలోచన ఏమిటో తెలియడం లేదు. షూటింగ్ ఏర్పాట్లు మాత్రం చకచకా చేసేస్తున్నారు. వంశీ పైడిపల్లి అప్పుడే డెహ్రాడూన్ బయలు దేరిపోయారు.
వాస్తవానికి మొన్న 4న ఈ కేసు హియరింగ్ వుంది. కానీ స్టే వెకెట్ పిటిషన్ టేబుల్ పైకి రాలేదని తెలుస్తోంది. అందువల్ల మళ్లీ వాయిదానే. ఇదిలా వుంటే పివిపితో ఒకసారి బేసిక్ సంప్రదింపులు చేసిన దిల్ రాజు యూనిట్ మళ్లీ ఆ తరువాత ఆ ప్రస్తావన చేయలేదని తెలుస్తోంది. 10తరువాత ఏం జరుగుతుందో చూడాలి. పివిపి అయితే మొండిగా ముందుకే వెళ్లే రకం. మహేష్ ఏం చేస్తారో మరి.