cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా లవర్ గా గల్లా పుత్రుడు

సినిమా లవర్ గా గల్లా పుత్రుడు

ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, హీరో కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఇంక అంతకన్నా క్రేజ్ ఏం కావాలి. అందుకే గల్లా అశోక్ హీరోగా నిర్మించే సినిమా ప్రారంభోత్సవానికి టాలీవుడ్ ప్రముఖులు అంతా తరలి వస్తున్నారు. గల్లా జయదేవ్ కుటుంబానికి అత్యంత ఆప్తులు అయిన సినిమా జనాలు అంతా వస్తారు.

రామ్ చరణ్, రానా లాంటి యంగ్ స్టార్స్, కృష్ణ లాంటి సీనియర్ అసలు సిసలు అతిధులు. ఓపెనింగ్ ఫంక్షన్ లకు హాజరుకాకపోవడం అన్న సెంటిమెంట్ వున్న మహేష్ బాబు మినహా చాలా మందే వస్తారు.

ఇదిలా వుంటే భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి యావరేజ్ లేదా ఫ్లాపు సినిమాలు అందించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాతో తన లక్ ను నాలుగోసారి పరీక్షించుకోబోతున్నాడు.

సినిమాలో హీరో సినిమాలంటే పిచ్చి ఇష్టం వున్న యువకుడిగా కనిపించబోతున్నాడని బోగట్టా. అందుకే సినిమా లవర్ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు. పాజిటివ్ రెస్పాన్స్ వుంటే అదే టైటిల్ ఖరారు చేస్తారని తెలుస్తోంది.