Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రూలర్ ఫస్ట్ హాఫ్ రెడీ

రూలర్ ఫస్ట్ హాఫ్ రెడీ

నందమూరి బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న రూలర్ సినిమా వ్యవహారం ఫుల్ స్పీడ్ లో వుంది. డిసెంబర్ 20న విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ కూడా రాబోతోంది. ఇంక జస్ట్ నలభై రోజులు మాత్రమే మిగిలింది సినిమా వర్క్ పూర్తి కావడానికి. చివరి పది రోజులు ఫినిషింగ్ వర్క్ లకు పక్కన పెడితే, నెల రోజులు వుంది రెడీ కావడానికి. 

రూలర్ తో పాటు వస్తాయి అనుకుంటన్న వెంకీమాట, ప్రతిరోజూ పండగే సినిమా అప్పుడే దాదాపు రెడీ అయిపోయాయి. రూలర్ పరిస్థితి ఏమిటో అనుకునే అభిమానులకు ఓ వార్త. రూలర్ సినిమా ఫస్ట్ హాఫ్ అన్ని పనులు ఫినిష్ చేసి, రీ రికార్డింగ్ కు కూడా ఇచ్చేసారు. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్  చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఆయన కేవలం పాటలు మాత్రమే చేస్తారు. అందువల్ల నేపథ్య సంగీతం కోసం మన సంగీత దర్శకుడు జీవన్ (జెబి) కి ఇచ్చేసారు. 

ఫస్ట్ హాఫ్ ఇచ్చేసారు అంటే ఇంక సెకండాఫ్ పని మాత్రమే మిగిలిందన్నమాట. ఆర్ ఎఫ్ సి లో చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు, నెలాఖరుకు సెకండాఫ్ కూడా లాక్ అయిపోతుందని తెలుస్తోంది. రూలర్ సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ లో కనిపిస్తారు. ఒకటి డాన్, రెండవది పోలీస్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?