Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Gossip

కన్నడ కామెడీ రిపీట్ అవుతుందా?

కన్నడ కామెడీ రిపీట్ అవుతుందా?

మొత్తానికి.. చివరితేదీ వరకు వచ్చిన తర్వాత.. .మహారాష్ట్ర గవర్నర్ భగత్ సిం గ్ కోశ్యారీ ఒక ముందడుగు వేశారు. శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. అయితే కేవలం ఒకే రోజు గడువు ఇచ్చారు. సోమవారం ఆయన శాసనసభలో తన బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా శివసేన ఏమాత్రం మెత్తబడిన దాఖలాలు కనిపించకపోతుండగా.. బలనిరూపణ ఎలాగనేది సందేహాస్పదంగానే ఉంది. కర్నాటకలో యడియూరప్ప గద్దెనెక్కి.. బలం చూపించలేక.. విలపిస్తూ రాజీనామాచేసిన ఎపిసోడ్ మహారాష్ట్రలో రిపీట్ కాకుండా ఉండాలంటే.. కమలదళం ఎలాంటి మంత్రాంగాన్ని ప్రయోగించబోతోంది.. అనేది ఇప్పుడు కీలకంగా మారింది.

శివసేన ఇప్పటిదాకా ఏ మాత్రం బెట్టు సడలించలేదు. ముఖ్యమంత్రి సీటును పంచుకునే ఆఫర్ తో గనుక రాకపోయినట్లయితే.. భాజపాతో చర్చించేదేమీ లేదని ఆ పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారు. అలాగని వారు కాంగ్రెస్-ఎన్సీపీలతో జట్టుకట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎన్సీపీ చాలా సమర్థంగా తమ కూటమిలోకి రాగల గేట్లు మూసేసింది. తాము ప్రతిపక్షంలో ఉండడానికే ఇష్టపడతామని తేల్చేసింది. శివసేన గానీ, భాజపా గానీ మెట్టు దిగాల్సిందే.

అలా జరగకపోతే మళ్లీ ఎన్నికలను ఎదుర్కోక తప్పదు. ఇప్పటికిప్పుడు వెంటనే మళ్లీ ఎన్నికలు వస్తే నష్టమెవరికి? లాభమెవరికి? అనే మీమాంస ఇప్పుడు నడుస్తోంది. ఎవరు నష్టపోయే ప్రమాదం ఉంటుందో.. వారే బెట్టు సడలించాలి. మూడు పార్టీలకంటె కనీసం యాభై సీట్లు ఎక్కువ సాధించిన పార్టీ గనుక.. భాజపా గద్దె ఎక్కదలచుకోవడం కరెక్టే కావొచ్చు.

కానీ.. కర్నాటక కామెడీ ఎపిసోడ్ రిపీట్ కాకుండా ఉండాలంటే.. ఎవరో ఒకరు రాజీ పడక తప్పదు. ఇంకో ట్విస్టుకు అవకాశం ఉంది. కమలదళంతో అంతో ఇంతో సత్సంబంధాలు కలిగిఉన్న ఎన్సీపీ, తక్షణ ఎన్నికలు రాకుండా చూసేందుకు...  ఓటింగుకు గైర్హాజరైనా.. ప్రస్తుతానికి ఫడ్నవీస్ గట్టెక్కుతాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?