సక్సెస్ అనేది ఇచ్చే కిక్ వేరుగా వుంటుంది. అయితే ఆ కిక్ ను ఎంజాయ్ చేయాలి కానీ, తలకెక్కించుకోకూడదు. 2021 లో వచ్చిన ఓ హిట్ ఓ డైరక్టర్ కు అలా ఎక్కేసినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సరే, అలా ఎక్కేస్తే అది ఆయన సమస్య అనుకుందాం. కానీ ఆ ఓవర్ కిక్ లో, సినిమా సక్సెస్ అంతా తనదే అనే భ్రమలోకి వెళ్లిపోయారని, ఆ భ్రమలోనే మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఆ సినిమాకు సంగీతం అందించారు ఓ మ్యూజిక్ డైరక్టర్. కానీ మ్యూజిక్ డైరక్టర్ ఫస్ట్ హాఫ్ కు మాత్రమే ఇచ్చారని, సెకండాఫ్ కు తాను వేరే మ్యుజిషియన్ తో చేయించుకున్నానని చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసి ఆ మ్యూజిక్ డైరక్టర్ ఫీలవుతున్నట్లు బోగట్టా. అలాగే ఆ సినిమా స్క్రిప్ట్ కు ఓ పెద్దాయిన సాయం పట్టారట. హీరో రిక్వెస్ట్ చేసి, ఆ పెద్దాయిన స్క్రిప్ట్ తీసుకుని, కావాల్సినవి వాడుకున్నారట.
ఆ సంగతిని కూడా తెలియనట్లు, అంత తనదే క్రెడిట్ అన్నట్లు మాట్లాడుతున్నారట. అది విన్నవాళ్లు సక్సెస్ కిక్కు…బాగా ఎక్కిపోయినట్లుంది అని వెనకాల కామెంట్ లు విసురుతున్నారు.