హీరోలకే కాదు, టాప్ ఫైవ్ పెద్ద డైరక్టర్లకు ఓ లైనప్ అనేది వుంటుంది. ఆ మధ్య వరకు ఎన్టీఆర్, ఆ తరువాత మహేష్, ఆ తరువాత బన్నీ ఇలా లైనప్ వుండేది డైరక్టర్ త్రివిక్రమ్ కు.. కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా తారుమారు అవుతున్నట్లుంది.
ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ అయింది. పోనీ తరువాత వుంటుందేమో అనుకుందామంటే, ఆర్ఆర్ఆర్, కొరటాల శివ సినిమా, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్ లో వున్నాయి. కనీసం రెండేళ్ల పై మాటే. 2023 చివర్లో కానీ ఎన్టీఆర్ ఇవ్వాలి అనుకున్నా డేట్ లు త్రివిక్రమ్ కు కేటాయించలేరు.
త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ తో సినిమా ప్లానింగ్ లో వున్నారు. ఆ తరువాత బన్నీ రెడీగా వుంటారు అని మొన్నటి వరకు టాక్ వుండేది. కానీ బన్నీ కూడా పుష్ప రెండు భాగాలు ఫినిష్ చేయాలి.
బోయపాటి, వేణు శ్రీరామ్ పేర్లు వినిపిస్తూనే వున్నాయి. పోనీ అవి పక్కన పెట్టేస్తాడేమో అనుకున్నా, మరో ఏణ్ణర్ధం వరకు అయితే బన్నీ ఖాళీ లేనట్లే. పవన్ కళ్యాణ్ తో సహా మరే టాప్ హీరో ఖాళీగా లేరు ఇప్పుడు.
మరో రెండేళ్ల వరకు సినిమాలు ఫిక్స్ చేసుకుని వున్నారు. కేవలం రామ్ చరణ్ తప్ప. ఇక చరణ్ కోసమే ట్రయ్ చేయాలేమో త్రివిక్రమ్. లేదూ అంటే గతంలో మాదిరిగా ఎప్పటి నుంచో మరో చిన్న సినిమా చేయాలన్న తన ఆలోచనను బయటకు తీయాల్సి వుంటుంది.