సినిమా ‘వక్కంత’ము లేదు

వక్కంతం వంశీ. ఆల్ కూ జమ్ జమ్ మాదిరిగా రకరకాల కథలు ముడిపెట్టి, కొత్త కథలు అల్లుతూ, కథకు కోటి రేంజ్ పారితోషికం తీసుకునే స్టేజ్ కు ఎదిగారు. అలా కథకుడిగా వుండి వుంటే…

వక్కంతం వంశీ. ఆల్ కూ జమ్ జమ్ మాదిరిగా రకరకాల కథలు ముడిపెట్టి, కొత్త కథలు అల్లుతూ, కథకు కోటి రేంజ్ పారితోషికం తీసుకునే స్టేజ్ కు ఎదిగారు. అలా కథకుడిగా వుండి వుంటే ఎలా వుండేదో? పట్టుపట్టి దర్శకుడిగా మారారు. 

అల్లు అర్జున్ చేత 'నాపేరు సూర్య' అనిపించి, పెద్ద హిట్ కొడదామనుకున్నారు. కానీ ఆ సినిమాతో అల్లు అర్జున్ నే బోలెడన్ని నెలలు పక్కన కూర్చో పెట్టేసారు. కానీ ఆ తరువాత గీతా క్యాంప్ లోనే వున్నారు. కానీ సరైన స్క్రిప్ట్ కుదరడం లేదు. సినిమా సెట్ కావడంలేదు.

ఇదిలావుంటే ఆ మధ్య ఓ పెద్దాయిన, ఎలాగోలా మెగాస్టార్ చిరంజీవిని కథ వినడానికి ఒప్పించి వక్కంతం వంశీని తీసుకెళ్లారట. పాపం, సీరియస్ గానే కథ విన్న, చిరంజీవి ఏ మాత్రం మొహమాట పడకుండా సారీ చెప్పేసారని తెలుస్తోంది. దాంతో వక్కంతం వంశీ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. 

ప్రస్తుతం ఏ హీరో ఖాళీ లేరు. వక్కంతం గీతాలో స్క్రిప్ట్ లకు సాయంపడుతూ ప్రస్తుతానికి కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందివచ్చిన ఫస్ట్ అవకాశం విజయవంతం కాకపోతే టాలీవుడ్ లో కాస్త కష్టమే. మరో రచయిత బివిఎస్ రవి కూడా అలాగే వుండిపోయారు. 

జగన్ గేమ్ తో టీడీపీకి చెక్?