హీరోయిన్ త్రిషకి, మాజీ హీరోయిన్.. ప్రస్తుతం నిర్మాత అయిన ఛార్మి 'ప్రపోజల్' పెట్టింది. అది కూడా 'పెళ్ళి చేసుకుందాం' అని. ఏకంగా, 'మోకాలి మీద కూర్చుని చేస్తున్న ఈ ప్రపోజల్‌ని ఒప్పుకుంటావ్ కదూ.!' అని ఛార్మి ప్రాధేయ పడితే, త్రిష ఒప్పుకోకుండా వుంటుందా.? పైగా, 'ఇదిప్పుడు దేశంలో చట్ట వ్యతిరేకమేమీ కాదు' అని కూడా ఛార్మి చెప్పిందండోయ్. ఛార్మి ప్రపోజల్‌కి త్రిష ఓకే చెప్పేసింది. 'థాంక్యూ.. ఇప్పటికే ఓకే చెప్పేశాను కదా..' అంటూ త్రిష రిప్లయ్ ఇచ్చింది.
త్రిష, ఛార్మి మంచి ఫ్రెండ్స్.. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఈ గ్యాంగ్‌లో ఇంకో హీరోయిన్ కూడా వుంది. ఆమె ఇంకెవరో కాదు, 'కొమురం పులి' ఫేం నికీషా పటేల్. త్రిష పుట్టినరోజు సందర్భంగా నికీషా, త్రిషకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, తామంతా కలిసి వున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ఛార్మి కాస్త డిఫరెంట్‌గా.. అదీ పై విధంగా త్రిషకి 'ప్రపోజల్' పెట్టి మరీ శుభకాంక్షలు అందించింది. అదీ అసలు కథ.
కానీ, నెటిజన్లు ఊరుకుంటారా.? ఇటు త్రిషతోనూ.. అటు ఛార్మితోనూ ఓ ఆట ఆడేసుకున్నారు. 'ఇదేం పైత్యం.?' అంటూ కొందరు ప్రశ్నించారు. 'ఇద్దరూ చాలా తేడాగా వున్నట్టున్నారే…' అని మరికొందరు సెటైర్లు వేశారు. ఆ మధ్య తమన్నా – శృతిహాసన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. బహుశా ఆ స్థాయిలో 'ఫైర్' పుట్టాలనే ట్విట్టర్‌లో ఛార్మి, ఇలా త్రిషపై తన 'ప్రేమను' చాటుకుందేమో.!
కొంచెం వెరైటీగా ఆలోచిస్తే చాలు.. అది వివాదాస్పదమైనాసరే, విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. సోషల్ మీడియా నేర్పిన పాఠమిది. ఆ నాడిని సెలబ్రిటీలు బాగా పట్టేశారు మరి.