సినిమా వాళ్లకి సిగ్గేమిటి?

ఇదివార్త శీర్షిక కాదు..సహజంగా తరచు జనాల్లో వినిపించేమాట. అయితే వారు సినిమాల్లో జరిగే ఎక్స్ పోజింగ్ వ్యవహారాలు చూసి ఈ మాట అంటూ వుంటారు. అయితే ఇప్పుడు విషయం అది కాదు. ప్రకాష్ రాజ్..శ్రీను…

ఇదివార్త శీర్షిక కాదు..సహజంగా తరచు జనాల్లో వినిపించేమాట. అయితే వారు సినిమాల్లో జరిగే ఎక్స్ పోజింగ్ వ్యవహారాలు చూసి ఈ మాట అంటూ వుంటారు. అయితే ఇప్పుడు విషయం అది కాదు. ప్రకాష్ రాజ్..శ్రీను వైట్ల…ఆగడుసినిమా సమయంలో ఇలా అలా ఘర్షణపడలేదు. ఓ రేంజ్ లో పడ్డారు. ఆయన సినిమాలోంచి తప్పుకున్నాడు. 

ఆగకుండా శ్రీను వైట్లపై కవిత రాసాడు.ఈయన తక్కువ తినలేదు. ఆ కవితను తీసుకెళ్లి అదే సినిమాలో పెట్టాడు. దాంతో ప్రకాష్ రెచ్చిపోయి కామెంట్ చేసాడు. ఈయనా ఊరుకోలేదు. నాకు అంకితం ఇచ్చిన కవిత..నా ఇష్టం..వచ్చినట్లు వాడుకుంటా అన్నాడు. 

కట్ చేస్తే..

ఇప్పుడు మళ్లీ ఇద్దరూ ఒక్కటైపోయారు. ఇంతకు ముందే రామ్ చరణ్ సినిమా కోసం శ్రీను వైట్ల గతంలో తాను కొట్లాడిని కోనం వెంకట్ తో రాజీ పడ్డాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ తో. ఎప్పుడూ కొట్టుకుంటూ వుండాలని, కలవకూడదని కాదు. కానీ చిన్న చిన్న ఇగో సమస్యలను పెద్దవి చేసుకుని, వీధికెక్కిన వాళ్లు మళ్లీ ఇలా చెట్టపట్టాలు వేసుకోవడం అంటే కాస్త ఆశ్చర్యమే.