మా ఎన్నికలు ఇంత గడబిడగా మారడం వెనుక దర్శకుడు దాసరి, హీరో చిరంజీవి వున్నారా? వీళ్లిద్దరు పైకి ఏమీ మాట్లాడకున్నా, రెండు వర్గాలను ఎగసందోసింది వీరేనా? ఇలాంటి టాక్ ఒకటి టాలీవుడ్ లో వినిపిస్తోంది. దాసరి జయసుధ వర్గం వైపు, చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ వెనుక వున్నారని టాక్.
చిరంజీవి వర్గం రాజేంద్ర ప్రసాద్ వెనుక వున్నారని తెలిసాకే, టాలీవుడ్ లోని కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్క తాటిపైకి వచ్చి, పట్టుదలగా పనిచేస్తోందని వినికిడి. రాజేంద్ర ప్రసాద్ వెనుక చిరంజీవి వున్నారని తెలిసిన తరువాతే దర్శకుడు దాసరి పావులు కదిపి, తన శిష్యులు మోహన్ బాబు, మురళీ మోహన్ ల ద్వారా జయసుధను రంగంలోకి దింపారని తెలుస్తోంది.
ఎప్పుడైతే జయసుధ వెనుక మెజార్టీ వర్గం చేరిందో, అప్పటి నుంచి చిరంజీవి తన ఆనుపాను అస్సలు తెలియకుండా జాగ్రత్త పడ్డారని, కానీ తెరవెనుక జరగాల్సిన వ్యవహారాలు జరుగుతన్నాయని తెలుస్తోంది.