సినిమాలు సెట్ చేస్తున్న దర్శకుడు?

ఇండస్ట్రీలో పరిచయాలు, పలుకుబడులు వుండాలే కానీ పైసా పెట్టుబడిలేకుండా డబ్బులు ఆర్జించుకోవచ్చు. ఒకప్పుడు ఈ పని ఎవరో ఒకరిద్దరే చేసేవారు. చేతినిండా పని వున్నవాళ్లు ఇలాంటి వాటి జోలికిపోయేవారు కాదు. కానీ కాదేదీ డబ్బు…

ఇండస్ట్రీలో పరిచయాలు, పలుకుబడులు వుండాలే కానీ పైసా పెట్టుబడిలేకుండా డబ్బులు ఆర్జించుకోవచ్చు. ఒకప్పుడు ఈ పని ఎవరో ఒకరిద్దరే చేసేవారు. చేతినిండా పని వున్నవాళ్లు ఇలాంటి వాటి జోలికిపోయేవారు కాదు. కానీ కాదేదీ డబ్బు సంపాదనకు అనర్హం అన్నట్లుగా ఇది కూడా మంచి మార్గమే అనిపిస్తోంది సినిమా జనాలకు ఇప్పుడిప్పుడే.  ఇటు స్ట్రగులయ్యే డైరక్టర్ కు సినిమా సెట్ చేస్తే, ఓ కోటి చులాగ్గా పుచ్చుకోవచ్చు. అదే టైమ్ లో ఆ నిర్మాణ సంస్థ దగ్గర షేర్ లాగేయవచ్చు.

ఓ అగ్రదర్శకుడు తన పలుకుబడి ఉపయోగించి ఓ పెద్ద నిర్మాణ సంస్థకు సినిమాలు సెట్ చేయించే పనిలో పడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ పెద్ద స్టార్ తో ఓ సినిమాను సెట్ చేయించి, లాభాల్లో వాటా లేదా లమ్ సమ్ అమౌంట్ అనే డీల్ సెట్ చేసుకున్నట్లు గుసగుసలు వున్నాయి.

ఇప్పుడు అదే సంస్థకు ఓ మెగా హీరో తో కూడా సినిమా సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ యంగ్ డైరక్టర్ తో కథ చెప్పించడం, కథకు మార్పులు చేర్పులు సూచించడం అవీ చేసి, సినిమాను సెట్ చేసే పనిలో వున్నారని బోగట్టా. ఇది కనుక సెట్ అయితే ఈ రకమైన రెండో డీల్ సెట్ అయినట్లే.

తను డైరెక్ట్ చేసే సినిమాల మార్కెటింగ్ ఆయనే చూసుకుంటారని, ఆ విధంగా కూడా ఆయనకు బిజినెస్ డీల్స్ వున్నాయని టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ విధంగా సినిమాలు సెట్ చేయడం వల్ల కూడా అదనపు ఆదాయం అన్నమాట. ఎవరైనా సరే, దీపం వుండగానే కదా ఇల్లు చక్కబెట్టుకోవాలి. తప్పేముంది? ఇదో రకం వ్యాపారం అనుకోవాల్సిందే.

టాలీవుడ్ కు ఆంధ్ర ప్రభుత్వం అంతగా ఆనడం లేదు