క్లాప్ కొట్టినపుడే టీజర్ కూడా

ఆలూ లేదు చూలూ లేదు అని సామెత. కానీ కొడుకు వుండాలని, వాడికి సోమలింగం అని పేరు పెట్టాలని అనకోవడం తప్పు కాదుగా. సినిమా నిర్మాణం ఓ పక్క జరుగుతుంటే, అభిమాన జనాలను ఊరిస్తూ,…

ఆలూ లేదు చూలూ లేదు అని సామెత. కానీ కొడుకు వుండాలని, వాడికి సోమలింగం అని పేరు పెట్టాలని అనకోవడం తప్పు కాదుగా. సినిమా నిర్మాణం ఓ పక్క జరుగుతుంటే, అభిమాన జనాలను ఊరిస్తూ, కాలు చేయి మాత్రం చూపించడం, ఒక్క డైలాగ్ కొట్టించడం ఇలాంటి పనులతో టీజర్ వదలడం అన్నది ఆనవాయితీ టాలీవుడ్ లో. కానీ పూరి జగన్నాధ్ స్టయిల్,ఆలోచనలు వేరుగా వుంటాయి. ఎంతయినా గురువు వర్మ ప్రభావం కదా. 

అందుకే ఎన్టీఆర్ తో రెండో సారి తను చేసే సినిమాకు క్లాప్ కొట్టిన రోజునే ఓ టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాడట. ఇప్పుడీ వార్త ఒక్కసారి గుప్పు మంది. క్లాప్ కోట్టిన రోజే సినిమా ఎలా వుండబోతోందో శాంపిల్ చూపిస్తాడన్నమాట. బాగానే వుంది అయిడియా కానీ కాస్త ఓవర్ గా వున్నట్లు లేదూ?