కష్టానికి తగ్గ సక్సెస్‌ వస్తుందా.?

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా, కెరీర్‌లోనే అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. ఈ మాట ఆమే స్వయంగా చెబుతోంది. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేసినా, వాటి కోసం ఎంతో కష్టపడ్డా, బాక్సర్‌ ‘మేరీకోమ్‌’ జీవిత…

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా, కెరీర్‌లోనే అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. ఈ మాట ఆమే స్వయంగా చెబుతోంది. ఇప్పటిదాకా చాలా సినిమాలు చేసినా, వాటి కోసం ఎంతో కష్టపడ్డా, బాక్సర్‌ ‘మేరీకోమ్‌’ జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమా మాత్రం అత్యంత కఠిన పరీక్ష తనకు పెట్టిందని ప్రియాంకా చోప్రా చెప్పుకొచ్చింది.

మేరీకోమ్‌లా వుండేందుకు తన శరీరాన్ని చాలా మార్చుకుంది ప్రియాంకా చోప్రా. చేతి కండరాలు, కాలి కండరాలు, పొట్ట కండరాలూ కాస్త బయటకు కన్పించేలా కసరత్తులు చేసిన ప్రియాంకా చోప్రా, బాక్సింగ్‌ ప్రత్యేకంగా నేర్చుకుంది కూడా. ఈ క్రమంలో చాలా దెబ్బలు కూడా తినేసిందట.

ఎంత కష్టపడ్డా, మేరీకోమ్‌లా సినిమాల్లో నటించడం గౌరవంగా భావిస్తున్నాననీ, ఆ భావనే ఎంత కష్టమైనా తనకు తెలియకుండా చేసిందని అంటోంది ప్రియాంకా చోప్రా. చాలా జాగ్రత్తలు తీసుకుని చేసిన ఈ సినిమా తన సినిమా కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్‌ మూవీ అవుతుందని ప్రియాంక ఆశాభావం వ్యక్తం చేసింది.