సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు కలెక్షన్లు దాచేస్తారు. బయటకు రానివ్వరు. వాళ్లు వదిలే ఫిగర్లే ఫిగర్లు అన్నట్లు చలామణీ చేస్తారు. కానీ చిన్న సినిమాలకు మాత్రం కలెక్షన్లు దాచడం వుండదు.
పైగా నిత్యం సోషల్ మీడియాలో, డిస్ట్రిబ్యూషన్ గ్రూపుల్లో కలెక్షన్ల వివరాలు షో టు షో వస్తూనే వుంటాయి. కానీ చిత్రంగా ఉత్తరాంధ్రలో వున్న దిల్ రాజు థియేటర్ల నుంచి కలెక్షన్ల వివరాలు బయటకు రావడం ఆగిపోయింది.
పాగల్ సినిమాకు ఓపెనింగ్ బాగానే వచ్చిందా? లేదా? అన్నది పక్కన పెడితే అసలు ఎలా వచ్చాయి అన్నది తెలియలేదు. గత వారం రోజులుగా ఇదే స్ట్రాటజీ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్ట్రాటజీ ఎందుకోసం అన్నది దిల్ రాజుకే తెలియాలి.
థియేటర్లు సమస్యలో వున్నాయని, ఇలాంటి టైమ్ లో కలెక్షన్లు బయట పెడితే కొన్ని సమస్యలు వస్తాయని, కొన్ని లెక్కలు తెలుస్తాయని, అందుకే వాటిని బయటకు రానివ్వడం లేదని బోగట్టా.
అయితే కలెక్షన్లు బయటకు వస్తే సమస్య ఏమిటా? అన్నది దిల్ రాజుకే తెలియాలి. టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంతో దీనికేమైనా ముడి వుందా? అన్నది కూడా డవుటే.