Advertisement

Advertisement


Home > Politics - Gossip

'దేశం'పై 'గోరంట్ల' అసంతృప్తి?

'దేశం'పై 'గోరంట్ల' అసంతృప్తి?

తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో బాధపడుతున్నారా? ఆయన సన్నిహితవర్గాలు దీనికి అవుననే అంటున్నాయి. సీనియర్ అయిన గోరంట్ల ఈ వయసులో కూడా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో చాలా యాక్టివ్ గా వుంటున్నారు. నిత్యం తనదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు.

కానీ తెలుగుదేశం పార్టీ ఆయనను వృద్దుడిగా లెక్కవేసి పక్కన పెట్టిందని, పార్టీలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సన్నిహితుల దగ్గర ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారని తెలుస్తోంది. 

గోరంట్లకు సమస్య ఏమిటంటే ఆయన కుమారుడు బిజీగా వున్న డాక్టర్. అందువల్ల ఆయనను రాజకీయాల్లో బిజీ చేయడం కష్టం. అందువల్ల గోరంట్లకే అవకాశం ఇవ్వాలి. కానీ యంగ్ జనరేషన్ ను ఎంకరేజ్ చేయాలనుకోవడం వల్ల ఆయనను పక్కన పెడుతున్నారు

అయితే అంతమాత్రం చేత గోరంట్ల పార్టీ నుంచి జంప్ చేస్తారని అనుకోవడానికి లేదు. కానీ ఆయన తన అసంతృప్తి అలా అలా బయటకు రావాలని, అది పార్టీ దృష్టికి వెళ్లి మళ్లీ తనను యాక్టివ్ రోల్ కు తీసుకోవాలని అనుకుంటున్నారని  తెలుస్తోంది. కానీ ఆ అసంతృప్తిని వైకాపా క్యాష్ చేసుకుంటుందా? దానికి గోరంట్ల సహకరిస్తారా? అన్నది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?