కాస్త ఆశ్చర్యమైన సంగతే. చాలా కాలంగా సినిమాలు లేకుండా వున్న ఓ సీనియర్ హీరో కు ఈ రేటు పలికింది అంటే కచ్చితంగా కాస్త ఆశ్చర్యమే. అయితే ఇది నిజం.
సీనియర్ హీరో రాజశేఖర్ తాను చేయబోయే ఒక సినిమాకు కోట్ చేసి తీసుకున్న మొత్తం ఇది. దర్శకుడు శ్రీవాస్ హీరో గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరో అన్నయ్య పాత్ర కూడా చాలా కీలకం. ఈ పాత్రకు రాజశేఖర్ అయితే బాగుంటుందనుకున్నారు.
కానీ హీరోగా తప్ప చేయనని చాలా కాలంగా పక్కన వుండిపోయిన రాజశేఖర్ ను మొత్తానికి ఒప్పించారు. పాత్ర గౌరవప్రదంగా వుండాలని, తన్నులు తినడాలు అలాంటివి వుండకూడదనే షరతులతో పాటు నాలుగు కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసినట్లు బోగట్టా. దాంతో యూనిట్ అన్నింటికీ ఒప్పుకుని ఆయనను తీసుకుంది.
ప్రస్తుతం శేఖర్ సినిమా చేస్తున్న రాజశేఖర్ కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరుగుతుందని, జగపతి బాబు మాదిరిగా కొంత క్యారెక్టర్ నటుడు తెరపైకి వస్తారని, దర్శకుడు శ్రీవాస్ అంటున్నారు మరి.