cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

కామ్రేడ్.. మళ్లీ రీషూట్?

కామ్రేడ్.. మళ్లీ రీషూట్?

డియర్ కామ్రేడ్.. ఆరంభం నుంచి క్వాలిటీ కోసం పరితపిస్తూనే వస్తోంది. ఈ సినిమా బాధ్యతలు పూర్తిగా హీరో విజయ్ దేవరకొండ తన భుజాల మీద వేసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. విజయ్ నే ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా క్రియాశీలకంగా వ్యవహారిస్తున్నట్లు గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి.

ఆ సంగతి అలా వుంచితే ఇప్పటికే ఒకటికి రెండు మూడుసార్లు ఈ సినిమాకు రీషూట్ లు, పలు వెర్షన్ కట్ లు చేసారని టాక్ వుంది. లేటెస్ట్ గా ఈ నిన్న, ఈ రోజో మళ్లీ రీ షూట్ లు పెట్టారని వినిపిస్తోంది. అందుకోసం హీరోయిన్ రష్మిక డేట్ లు మళ్లీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రష్మిక వేరే సినిమా షూట్ లో వుంది. అక్కడ డేట్ లు అడ్జస్ట్ చేసుకుని, డియర్ కామ్రేడ్ రీషూట్ లకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న విడుదల వుండగా, ఇప్పటికీ ఇంకా రీషూట్ లు ఏమిటి? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

డియర్ కామ్రేడ్ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. సినిమాను ఆంధ్రలో 10 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. సినిమా హిట్ కొడితే బయ్యర్లకు ఓ రేంజ్ లో లాభాలు వస్తాయని టాక్ వుంది.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?