ఆ పెద్ద తలకాయతో జగన్ భేటీ ఎప్పుడు..?

వైసీపీ ఘన విజయం తర్వాత పార్టీలు, హోదాలకు అతీతంగా చాలామంది నేతలు జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కూడా వ్యక్తిగతంగా చాలామంది ప్రముఖులను కలసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి…

వైసీపీ ఘన విజయం తర్వాత పార్టీలు, హోదాలకు అతీతంగా చాలామంది నేతలు జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కూడా వ్యక్తిగతంగా చాలామంది ప్రముఖులను కలసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి పెద్ద తలకాయలా ఉన్న ఓ సీనియర్ నేతతో జగన్ భేటీ మాత్రం ఇంతవరకు సాధ్యంకాలేదు.

సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆయన అక్కడే ఉన్నారు, కానీ ఆయన్ను మాత్రం కలవకుండానే వచ్చేసేవారు జగన్. అది యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలనే జగన్ ఆయనను ఇగ్నోర్ చేశారా అనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీలేదు. అయితే జగన్ మనసెరిగిన వారికి మాత్రం దీనివెనక కొన్ని కారణాలున్నాయని చెబుతారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రత్యేకహోదా విషయంలో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారు, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు, ఎలా ఇవ్వరో చూస్తామంటూ వీరంగం వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపలేదు. ఏపీకి స్వయంప్రకటిత పెద్దగా చెప్పుకునే ఆయనకు చంద్రబాబుతో గొప్ప అనుబంధం ఉంది. ఎంత అనుబంధం ఉందంటే.. సొంత పార్టీని కూడా ఎదగనీయకుండా చేసేంత. అదే సమయంలో ఆ ద్వయం వైఎస్సార్ పై మీడియా అండతో ఎన్ని దుష్ప్రచారాలు చేసిందీ, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మహానేతను పలుచన చేయడానికి ఎన్ని కుట్రలు పన్నిందీ కొంతమందికి తెలిసిన విషయమే.

ఢిల్లీలో లాబీయింగ్ తో వైఎస్సార్ ని తొక్కేయాలని చాలా ఎత్తుగడలు వేశారాయన. కానీ అది సాధ్యంకాలేదు. మహానేత నిష్క్రమణం తర్వాత జగన్ కి వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉందని అంటుంటారు. అలా బాబు కోసం వ్యూహాలు రచిస్తూ.. జగన్ ని తొక్కేయడానికి తెరచాటు ప్రయత్నాలు చాలానే జరిగాయట.

ఇవన్నీ తెలుసు కాబట్టే జగన్ ఢిల్లీ వెళ్లినా తన దారిన తాను తిరిగొచ్చేసేవారని చెబుతారు. తాజాగా ఆ పెద్దాయన పుట్టినరోజును లోకేష్ తో పాటు తెలుగుతమ్ముళ్లంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తమ స్వామిభక్తి చూపించుకున్నారు. జగన్ తరపున మాత్రం ఎలాంటి విషెస్ లేవు. ఒకరకంగా అట్నుంచి ఆతృత ఉన్నా కూడా ఇట్నుంచి మాత్రం ఎలాంటి ఉత్సాహం లేకపోవడంతో సదరు పెద్దాయన కూడా ఫీలవుతున్నాడని సమాచారం.

సీఎం అయిన తర్వాత జగన్ ఎగురుకుంటూ వచ్చి తనను కలుస్తారని, తన ఆశీర్వాదం తీసుకుంటారని ఆశించిన ఆ పెద్ద మనిషికి భంగపాటు తప్పలేదు.

టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ? జగన్ ఒప్పుకుంటాడా?