విజయ్ దేవరకొండ-మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో నిర్మాణమైన సినిమా డియర్ కామ్రేడ్. ఈ సినిమా మాంచి హైప్ మీద విడుదలయింది, కానీ ఆశించిన ఫలితం సాధించడంలో విఫలమైంది. దీంతో బయ్యర్లను ఆదుకునే కార్యక్రమాన్ని మైత్రీ మూవీమేకర్స్ స్మూత్ గా ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి డియర్ కామ్రేడ్ మరీ భయంకరమైన ఫ్యాన్సీ రేట్లకు అమ్మలేదు. మైత్రీ రెగ్యులర్ బయ్యర్లకు చాలా రీజనబుల్ రేట్లకే ఇచ్చారు. అందువల్ల మరీ ఎక్కువగా వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమీలేదు. కానీ తమవైపు తప్పు వుండకూడదని, మైత్రీ జనాలు ఎవరికి వారికి నష్టపోయిన దాంతో యాభైశాతం వరకు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి వరుసగా సినిమాలు తీసే నిర్మాతలు ఇలా వెనక్కు ఇవ్వరు. తరువాత సినిమాలో చూసుకుందాం అని అంటారు. అయితే ఇటీవల టాలీవుడ్ లో ఇలా తరువాత అని కాకుండా, ఎప్పటికప్పుడు ఇచ్చేసి, క్లియర్ చేసుకుంటున్నారు. అజ్ఞాతవాసి టైమ్ లో ఇది స్టార్ట్ అయింది. మైత్రీ సంస్థ తన సవ్యసాచికి కూడా ఇలాగే చేసింది. ఇప్పుడు కామ్రేడ్ కు కూడా అదే పద్దతి పాటించారు.