మన్మధుడు 2 సినిమా ఫలితం తేలిపోయింది. మిగిలింది బయ్యర్లను ఎలా ఆదుకుంటారు అనేదే. ఈ విషయంలో మల్లగుల్లాలు మొదలయ్యాయి. మన్మధుడు 2 సినిమాకు ఒకరు కాదు నిర్మాత. నాగ్, జెమిని కిరణ్, వైకామ్ కలిసి సినిమాను నిర్మించారు. అందువల్లే తకరారు వస్తోంది. ఎలాగైనా కొంతయినా వెనక్కు ఇవ్వాలని నాగ్ సినిమాల మార్కెటింగ్ వ్యవహారాలు చూసే సాయిబాబు పట్టుపడుతున్నారు.
కానీ జెమిని కిరణ్, వైకామ్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇవ్వకుంటే భవిష్యత్ లో తీసే అన్నపూర్ణ సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుందని సాయిబాబు వాదనగా వుంది. ఇది కొత్త అలవాటు అవుతుందని జెమిని కిరణ్ వాదనగా వుంది. అయితే ఇప్పటికే చాలా సినిమాలకు ఇలా వెనక్కు ఇచ్చిన దాఖలాలు వున్నాయి.
దాదాపు వెనక్కు ఇవ్వడం అన్నది పక్కా అని, వైకామ్, జెమిని కిరణ్ అంగీకరించడం కోసమే వెయిటింగ్ అని తెలుస్తోంది. నెల్లూరు లాంటి చిన్న ఏరియాలోనే మన్మధుడు 2 సినిమాకు పాతిక లక్షల వరకు లాస్ వచ్చినట్లు బోగట్టా. మరి మిగిలిన ఏరియాల పరిస్థితి ఎలా వుంటుంది? వైజాగ్, నైజాం, కృష్ణ స్వంత విడుదల కాబట్టి ఓకె. మిగిలిన ఏరియాలకు ఎంతోకొంత సర్దుబాటు చేయాల్సివుంది.