Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విజయ్ నిర్మాణంలో తరుణ్ భాస్కర్

విజయ్ నిర్మాణంలో తరుణ్ భాస్కర్

విజయ్ దేవరకొండకు కెరీర్ టర్నింగ్ ఇచ్చిన సినిమా పెళ్లిచూపులు. ఆ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు డైరక్టర్ తరుణ్ భాస్కర్. ఆ మధ్య ఫలక్ నుమా దాస్ సినిమాతో యాక్టర్ గా కూడా మారారు. ఇప్పుడు ఏకంగా హీరోగా మారుతున్నారు.

తనను హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ను హీరోను చేసే బాధ్యతను విజయ్ దేవరకొండ తీసుకున్నారు. విజయ్ ఫాదర్ నిర్మాతగా ఓ సినిమాను చాలా సైలెంట్ గా ఫినిష్ చేసేసారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పూర్తయింది. త్వరలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా క్లిక్ అయితే ఇక విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ పై ఆయన ఫాదర్ నిర్మాతగా సినిమాల నిర్మాణం కొనసాగించే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే విజయ్ సమీప బంధువు యాష్ రంగినేని కూడా నిర్మాణ రంగంలో వున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?