cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జమాటో బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్

జమాటో బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్

స్విగ్గీ, జమాటో ఇవ్వాళ ఫుల్ పాపులర్. దాదాపు అన్ని సెకండ్ క్లాస్ టౌన్ ల్లో కూడా స్విగ్గీ, జమాటో సర్వీసులు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ రెండూ విపరీతంగా పోటీ పడుతున్నారు. స్విగ్గీ మీద పైచేయి సాధించడంలో భాగంగా జమాటో తన బ్రాండ్ అంబాసిడర్ గా యూత్ లో ఫుల్ క్రేజ్ వున్న విజయ్ దేవరకొండతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే ఒకటి రెండు యాడ్ ఫిల్మ్ లు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ఒక్కో అసైన్ మెంట్ టేకోవర్ చేస్తూ వస్తున్నాడు. కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్, రౌడీ వేర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఫ్లిప్ కార్ట్ వంటి బ్రాండ్ లకు అంబాసిడర్ గా వున్నాడు. ఇప్పుడు జమాటోతో పాటు మరో స్పోర్ట్స్ మ్యాచ్ కు కూడా బ్రాండింగ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

బ్రాండింగ్ కోసం విజయ్ కోటి రూపాయలు ఆపైన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.