కామ్రేడ్.. ఇంకా 50 రోజులు

డియర్ కామ్రేడ్.. విజయ్ దేవరకొండ-మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా మీద విజయ్ కు మంచి హోప్స్ వున్నాయి. ఈ సినిమాను మే ఫస్ట్ వీక్…

డియర్ కామ్రేడ్.. విజయ్ దేవరకొండ-మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా మీద విజయ్ కు మంచి హోప్స్ వున్నాయి. ఈ సినిమాను మే ఫస్ట్ వీక్ లో సమ్మర్ స్పెషల్ గా షెడ్యూలు చేసారు. కానీ ఇప్పుడు పరిస్ఢితి చూస్తుంటే ఆ టైమ్ కు వస్తుందా? రాదా? అన్న అనుమానం కలుగుతోంది.

ఈ సినిమాకు ఇంకా కనీసం 50 వర్కింగ్ డేస్ పనివుందని తెలుస్తోంది. కేవలం హీరోయిన్ రష్మిక మడొన్నా డేట్స్ నే ఇంకా మరో 30రోజులు వున్నాయి. అంటే ఏప్రియల్ సగంవరకు షూటింగ్ పనే వుంటుంది. పైగా స్క్రిప్ట్ లో కొన్ని ఛేంజెస్ చేసినట్లు టాక్. ఇటీవల అనుకోకుండా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది.

ఇవన్నీ అలావుంచితే, ఈ సినిమాను అదర్ లాంగ్వేజెస్ లో కూడా సమాంతరంగా విడుదలచేయాలని కొత్త ప్లాన్ ఏదో నిర్మాతలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కలిసి సినిమా వర్క్ ను పెంచుతున్నాయి. మొత్తంమీద ఏప్రియల్ చివరి వరకు పనివుంది. మే ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తే కానీ సాధ్యంకాకపోవచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

టీడీపీ బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపెవరిది 

లాభం లేదబ్బా ఈసారి ఆ ఎమ్మెల్యేను దించాల్సిందే