Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ మర్మమేమిటి చైతన్యా?

ఆ మర్మమేమిటి చైతన్యా?

ఈ మధ్య యూట్యూబ్ లో సినిమాల ట్రయిలర్లు, టీజర్లకు వచ్చే లుక్ లు లేదా హిట్ లను కూడా నమ్మడానికి కుదరడం లేదు. ఏవి నిజమో, ఏవి కాదో తెలియడం లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ హిట్ లు తెప్పించే ఏజెన్సీలు ఎన్నో పుట్టుకువచ్చాయి. లక్ష హిట్ లకు ఇంత, పదిలక్షల హిట్ లకు ఇంత అఫీషియల్ రేట్ లు వున్నాయి.

మరి నిజంగా వచ్చాయో? ఇలాంటి ఆర్టిఫిషియల్ హిట్ ల సంస్థను ఏమన్నా హైర్ చేసారమో తెలియదు కానీ, నాగచైతన్య-సమ్యంతల కాంబినేషన్ లోని మజిలి సినిమా ట్రయిలర్ కు 24 గంటలు గడవకుండా దగ్గర దగ్గర అయిదు మిలియన్ల వ్యూస్ వచ్చేయడం విశేషం.

అదేరోజు విడుదలైన సూర్య ఎన్ జీకె కన్నా ఇదే చాలా ఎక్కువ. సెన్సేషనల్ ట్రయిలర్ ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పోటా పోటీగా వ్యూస్ వచ్చేసాయి. అంతేకాదు అయిదువేల కామెంట్లు, లక్షన్నర లైకులు, ఇవన్నీ చూసి ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆర్టిఫిషయల్ గా హడావుడి చేయొచ్చు. కానీ మరీ ఇంతలాగా అంటున్నారు. అంతేకానీ నిజంగా వచ్చాయని ఇండస్ట్రీ జనాలు అయితే నమ్మడంలేదు.

కానీ యూనిట్ జనాలు మాత్రం ఎక్కడా ఎటువంటి మ్యానిపిలేషన్ లేదని, ప్యూర్ గా టీజర్ జనాలకు నచ్చబట్టే అన్ని లైకులు, హిట్ లు, కామెంట్ లు వచ్చాయని అంటున్నారు. అక్కడ నాగచైతన్య సినిమాగా మాత్రమే చూడడానికి లేదని, సమంత కూడా వుందన్న సంగతి మరిచిపోరాదని అంటున్నారు.

చిత్రమేమిటంటే వీడియోను లోడ్ చేసిన షైన్ స్క్రీన్ కు 66 వేలమంది సబ్ స్క్రయిబర్లు వున్నారు. అదే డిజిటల్ రైట్స్ వున్న ఆదిత్య మ్యూజిక్ కు ఎనిమిది మిలియన్ల సబ్ స్క్రయిబర్లు వున్నా, అక్కడ లోడ్ చేసిన వీడియోకు 16వేల వ్యూస్ కౌంట్ మాత్రమే వచ్చింది.

టీడీపీ బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపెవరిది 

లాభం లేదబ్బా ఈసారి ఆ ఎమ్మెల్యేను దించాల్సిందే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?