Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహానాయకుడు నో ప్రీరిలీజ్ పబ్లిసిటీ

మహానాయకుడు నో ప్రీరిలీజ్ పబ్లిసిటీ

ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ కథానాయకుడుకు చేసినంత పబ్లిసిటీ మరి దేనికీ చేయలేదు. వీరలెవెల్లో లుక్కులు వదిలారు. హడావుడి చేసారు. రానా, బాలయ్య కలిసి బోలెడు వీడియోలు చేసి వదిలారు. ఇంతా అంతా హంగామా కాదు. కానీ ఫలితం తేడాకొట్టేసింది.

దాంతో రెండోభాగం మహానాయకుడికి స్కీమ్ మార్చేసారు. ఈ సినిమా విడుదలకు ముందు అస్సలు నో ఫబ్లిసిటీ అంట. అంతా సినిమా విడుదలయిన తరువాతే. వాస్తవానికి పార్ట్ 2కి మళ్లీ ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయాలని, మరో ట్రయిలర్ కట్ చేసి వదలాలని అనుకున్నారు. విశాఖ, అనంతపురం ప్రాంతాలకు టీమ్ లు వెళ్లి వెన్యూలు పరిశీలించి వచ్చాయి.

కానీ ఇప్పుడు అవన్నీ ఆపేసారు. నో ప్రీరిలీజ్ ఫంక్షన్. కేవలం ట్రయిలర్ మాత్రం నేరుగా ఆన్ లైన్ లోకి రేపో, ఎల్లుండో వదిలేస్తారంతే. సినిమా విడుదలయిన తరువాత రెస్పాన్స్ చూసకుని, ఇక అప్పుడు మొదలెడతారు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకునే రౌండ్ టేబుల్ ఇంటర్వూలు.

టీడీపీ బలంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపెవరిది 

లాభం లేదబ్బా ఈసారి ఆ ఎమ్మెల్యేను దించాల్సిందే 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?