Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రేజీ స్టూడియో చేతులు మారుతుందా?

క్రేజీ స్టూడియో చేతులు మారుతుందా?

నగరంలోని ఓ కీలకమైన, క్రేజీ స్టూడియోతో ఓ అంతర్జాతీయ సంస్థ బేరసారాలు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ప్రారంభ దశలో ఈ డీల్ డిస్కషన్లు, బేరసారాలు వున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఈ స్టూడియోకి దేశవ్యాప్తంగా మంచి పేరు వుంది. 

ఎలాంటి సినిమా నిర్మాణానికైనా, ఎలాంటి సదుపాయాలు క్లాప్ టు ప్రింట్ వరకు ఒక దగ్గరే వుంటాయనే పేరు వుంది. ఈ స్టూడియోను అమ్మాల్సిన అవసరం యాజమాన్యానికి లేదు. కానీ అంతర్జాతీయ స్టూడియో సంస్థ నుంచి మంచి ఆఫర్ రావడంతో చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

రేటు దాదాపు ఓ రేంజ్ వద్ద సెటిల్ అయిందని, అంతర్జాతీయ సంస్థ, విదేశీ పెట్టుబడులు ఇలాంటి వ్యవహారాలు అన్నీ ఇందులో వుండడంతో, ఈ మేరకు లీగల్ చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఇదేమంత సులువుగా, ఇవ్వాళో, రేపో జరిగిపోయేది కాదు. అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవహారం. అందువల్ల చాలా లెంగ్తీ ప్రాసెస్ వుంటుంది. అవన్నీ దాటుకుని, ఫైనల్ సెటిల్ మెంట్ కు, అగ్రిమెంట్ కు వెళ్లాలి అంటే చాలా నెలల ప్రాసెస్ వుంటుంది.

అవన్నీ అనుకున్నట్లు అయితే ఓ ఐకానిక్ స్టూడియో చేతులు మారే అవకాశం వుందని తెలుస్తోంది. కానీ అదే సమయంలో ఓ అంతర్జాతీయ స్టూడియో బ్రాండ్ హైదరాబాద్ లో కాలుపెడితే, ఇండియా వైడ్ గా బలమైన అట్రాక్షన్ గా మారే అవకాశమూ వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?