Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Analysis

గ్రౌండ్ రియాల్టీ కేరాఫ్ వైకాపా మేనిఫెస్టో

గ్రౌండ్ రియాల్టీ కేరాఫ్ వైకాపా మేనిఫెస్టో

పిల్లలు ఎన్ని డిమాండ్లు తండ్రి ముందు పెట్టినా, వాటిని ఎప్పుడు ఎలా నెరవేర్చగలను అన్నది తండ్రికి మాత్రమే తెలుసు. అప్పు చేయాలా? జీతం రావాలా? బడ్జెట్ సరిపోతుందా? అన్నది అతనికే క్లారిటీ వుంటుంది. సిఎమ్ కూడా అలాగే. ఆంధ్ర రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా వుంది అన్నది ఆంధ్ర సిఎమ్ కు క్లారిటీ వుంటుంది. వుంది కూడా. అలాగే అప్పుల పరిస్థితి, అవి పుట్టించేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కే కాదు, చంద్రబాబు కైనా వాగ్దానాలు నిలబెట్టుకోవడం కష్టమే.

అయితే అధికారం సాధించాలంటే హామీలు కుమ్మరించాల్సిందే కనుక చంద్రబాబు ఆరు సూత్రాలు అంటూ ముందుకు వచ్చారు. జనం తన వైపు మొగ్గాలి అంటే జగన్ ను మించిన హామీలు ఇవ్వాలి కనుక ఇచ్చారు. ముందు అధికారం అంటూ సాధిస్తే తరువాత చూడొచ్చు. అప్పులు పుడితే జనాలకు ఇవ్వొచ్చు. లేదంటే లేదు. ఒకసారి జగన్ ను గద్దె. దింపితే, వైకాపా ను లేకుండా చేసేస్తే, జగన్ ను అణగదొక్కేస్తే, ఇక ప్రజలకు దిక్కుండదు. హామీలు నెరవేర్చకపోయినా అడిగే పరిస్థితి వుండదు.

ఇక జగన్ పరిస్థితి వేరు. ఇప్పటికే మేనిఫెస్టో మాగ్జిమమ్ అమలు చేసినా, నిత్యం ఎల్లో మీడియాలో చేయలేదు అంటూ యాగీ చేస్తున్నారు. అలాంటిది అలవి కాని హామీలు ఇస్తే విజయం వస్తుందేమో కానీ ఆ తరువాత ఎన్నికలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వైకాపా మేనిఫెస్టో చూస్తుంటే అసలు జగన్ కు మళ్లీ కొత్త హామీలు ఇవ్వాలనే మూడ్ లేదని అర్థం అయిపోతోంది. ఏదో ఒకటి చెప్పాలనే ఆలోచనతో చెప్పినట్లు వుంది. ముఖ్యంగా పింఛన్లను ఎప్పుడో ఏళ్ల తరువాత పెంచుతాను అనడం నిజంగా మైనస్ నే.

అంటే ఆంధ్ర ఆర్ధిక పరిస్థితి అస్సలు బాగాలేదు అన్నది ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థం అవుతోంది వైకాపా మేనిఫెస్టోతో. గతంలో జగన్ రెండేళ్లు పదవీ కాలం పెంచారు ప్రభుత్వ ఉద్యోగులకు. ఇప్పుడు అధికారంలోకి మళ్లీ వస్తే ఎదుర్కొనే ప్రధాన సమస్య అదే. ఉద్యోగులకు ఫైనల్ సెటిల్ మెంట్లు కోసం చాలా మొత్తం కావాల్సి వుంటుంది. ఇవన్నీ జగన్ కు దృష్టిలో వుండే వుంటుంది. అందువల్ల కూడా కొత్త మేనిఫెస్టో ఇవ్వడం ఇష్టం వుండి వుండదు. పార్టీ నుంచి రైతు రుణ మాఫీ మీద వత్తిడి వచ్చినా జగన్ లొంగలేదు. అంటే గ్రౌండ్ రియాల్టీ బాగా తెలుసు.

గ్రౌండ్ రియాల్టీ తెలిసినా, జగన్ అధికారం కోసం అలవికాని హామీలు ఇవ్వకపోవడం మెచ్చుకోదగ్గ విషయం. కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలా వుండడానికి కారణం కూడా జగన్ ప్రవేశ పెట్టిన నగదు పథకాలే అన్నది బాధపడాల్సిన విషయం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?