Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డబ్బులు అడిగితే హీరో చెడ్డవాడా?

డబ్బులు అడిగితే హీరో చెడ్డవాడా?

బండ్లగణేష్ భోళా మనిషి...ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. టీవీ 9 కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మరోసారి సంచలనం రేపుతున్నాయి. ఎన్టీఆర్ కు మీకు వచ్చిన గొడవలేమిటి? అతనిలో దేవుడు మీకు కనిపించలేదా అని అడిగితే..సూటిగా సమాధానం చెప్పకుండా గోవిందుడు అందరివాడే టైమ్ లో​ రెండు కోట్లు బాకీ వున్నా, తరువాత చూసుకుందాం అన్నాడు...ముఫై ఏళ్ల వయసున్న రామ్ చరణ్..అదీ క్యారక్టర్ అంటే అని బదులిచ్చాడు. 

అసలు అడిగిన ప్రశ్న ఏమిటి? ఈ సమాధానం ఏమిటి? అంటే ఎన్టీఆర్ డబ్బులు అడిగాడు అనా..లేక రామ్ చరణ్ కే క్యారెక్టర్ వుంది, ఇతరులకు లేదు అనా? ఏమిటి బండ్ల ఉద్దేశం? అప్పుడే పనిలో పనిగా పవన్ కూడా తన దగ్గర డబ్బుల గురించి ప్రస్తావించలేదు అని అన్నారు. 

అంటే చెప్పకనే ఎన్టీఆర్ డబ్బుల కోసం వత్తిడి చేసారని, ఇచ్చాననే కదా అర్థం? మరి బండ్ల ఇలా ఎందుకు మాట్లాడేసినట్లు? టెంపర్ 2 వంటి ప్రాజెక్టు వుంచుకుని కూడా ఎన్టీఆర్ విషయంలొ ఇలా అన్యాపదేశంగా ఎందుకు మాట్లాడినట్లు. 

మరోపక్క రామ్ చరణ్ ను గాల్లోకి ఎత్తినట్లు? ఫ్లోలో అలా మాట్లాడేసారని అనుకోవాలా..ఎన్ కౌంటర్ కు దొరికి చెప్పారని అనుకోవాలా?అయినా హీరో తనకు రావాల్సిన డబ్బులు అడగకుండా వుంటే క్యారెక్టర్ వున్నట్లు..అడిగితే లేనట్లు అని అర్థం చేసుకోవాలా? దీనికి బండ్లే సమాధానం చెప్పగలరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?