అనుష్క పెరగాలట

బాహుబలి కోసం జనాలంతా హల్క్ టైపు పర్సనాలిటీలు బిల్డ్ చేసారు. ఐ కోసం విక్రమ్ పెరిగాడు..తరిగాడు..ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. పివిపి నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఇప్పుడు మరో ఇరవై…

బాహుబలి కోసం జనాలంతా హల్క్ టైపు పర్సనాలిటీలు బిల్డ్ చేసారు. ఐ కోసం విక్రమ్ పెరిగాడు..తరిగాడు..ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. పివిపి నిర్మిస్తున్న సైజ్ జీరో సినిమా కోసం అనుష్క ఇప్పుడు మరో ఇరవై కిలోలు బరువు పెరగాల్సి వుందట. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ డైరక్టర్ ఈసినిమాకు. 

సినిమాలో క్యారెక్టర్ కు అనుగుణంగా అనుష్క బరువు పెరిగే పనిలో పడిందట. అసలే అనుష్క ఏజ్ పర్సనాలిటీ అమ్మాయికి ఎక్కువ ఆంటీకి తక్కువ అన్నట్లు అయింది. ఆ మధ్య రజనీ సినిమాలో చూసినవారంతా..అమ్మో అన్నారు. మరి ఇప్పుడు మరో ఇరవై కేజీలు బరువు పెరగడం అంటే..కొంచైం ఆలోచించాల్సిన సంగతే.

నిజానికి బాహుబలి, రుద్రమదేవి సినిమాల కోసం స్లిమ్ అయిందని వినికిడి. మరి ఈ సినిమాకు పెరుగుతుందట,. ఇలా శరీరం మీద ప్రయోగాలు అమ్మాయిలకు మరీ ఇబ్బందేమో..అయినా సినిమాల మీద డెడికేషన్ వుంటే ఇలాగే చేయాలి..చేస్తారు కూడా.