ఒక పక్క రంగస్థలం సినిమా షూట్ చకచకా సాగిపోతోంది. సంక్రాంతికి కాకున్నా సమ్మర్ కు అయినా విడుదల పక్కా. మరోపక్క తను నిర్మాతగా తండ్రి మెగాస్టార్ తో నిర్మించే మెగామూవీ ఆఫ్ మెగాస్టార్ అనేంతగా ప్లాన్ చేస్తున్న సై..రా సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మాస్ దర్శకుడు బోయపాటి, నిర్మాత దానయ్యల నుంచి రామ్ చరణ్ కు ప్రపోజల్ వచ్చింది. ఓ సినిమా చేద్దామని.
ఇదే ఇప్పుడు రామ్ చరణ్ ను డైలమాలో పడేసినట్లు తెలుస్తోంది. రంగస్థలం షూట్ పనులు దాదాపు జనవరి నాటికి పూర్తవుతాయని అంచనా. ఆ తరువాత చరణ్ ఖాళీనే. ఎందుకుంటే మరే ప్రాజెక్టుకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దానయ్యకు ఓ సినిమా చేయాల్సివుంది. ఎందుకంటే ధృవ సినిమా దానయ్య ప్రాజెక్టే. కానీ ఆఖరి నిమిషంలో చరణ్ కోరిక మేరకు గీతాకు ఇచ్చేసారు. అందువల్ల ఓ సినిమా చేయాలి. బోయపాటితో చేయడం కూడా ఇష్టమే.
కానీ సై..రా పనులపై ఓ ఏడాది అంతా వుండిపోవడమా? రంగస్థలం సినిమాకు, సైరా వర్క్ కు మధ్యలో ఓ సినిమా చేయడమా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని వినిపిస్తోంది. బోయపాటి అయితే చిరంజీవి కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగానే, రామ్ చరణ్ కోసం రఫ్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వన్స్ చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, స్క్రిప్ట్ వినిపించి, ఫైనల్ చేసేందుకు వీలుగా బోయపాటి రెడీగా వున్నట్లు తెలుస్తోంది.
కానీ చరణ్ మాత్రం సైరా నిర్మాణం వైపే ఎక్కువగా దృష్టి పెట్టే ఆలోచనలో వున్నట్లు వినికిడి.