స్పైడర్ కు మరో ట్రయిలర్

మహేష్ అభిమానులకు ఆనందమే. స్పైడర్ సినిమాకు రెండో ట్రయిలర్ కట్ చేస్తున్నారు. ఇప్పటికే జేమ్స్ బాండ్ మూవీ తరహాలో, మురుగదాస్ స్టయిల్ లో ట్రయిలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ నెలలో స్పైడర్…

మహేష్ అభిమానులకు ఆనందమే. స్పైడర్ సినిమాకు రెండో ట్రయిలర్ కట్ చేస్తున్నారు. ఇప్పటికే జేమ్స్ బాండ్ మూవీ తరహాలో, మురుగదాస్ స్టయిల్ లో ట్రయిలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ నెలలో స్పైడర్ విడుదలకు ముందుగా రెండు మాంచి ఫంక్షన్లు వున్నాయి. ఒకటి చెన్నయ్ లో జరిగే అడియో విడుదల వేడుక. రెండవది హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ సక్సస్ మీట్. 

ఈ రెండు ఫంక్షన్లలో ఏదో ఒక దాంట్లో విడుదల చేసేలా ఈ రెండో ట్రయిలర్ ను రెడీ చేస్తున్నారు. మొదటి ట్రయిలర్ కు పూర్తి భిన్నంగా వుండేలా, కేవలం కథ చుట్టూ తిరిగేలా ఈ ట్రయిలర్ ను కట్ చేయడంలో స్పైడర్ యూనిట్ గత రెండు రోజుల్లో చెన్నయ్ లో బిజీగా వుంది. 

ఇదిలా వుంటే స్పైడర్ కు నెలకొన్న లో బజ్ అంతటికీ దర్శకుడు మురుగదాస్ నే అన్న కామెంట్లు ఫ్యాన్స్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ఆయన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా వున్నారు. కానీ ప్రచారం వ్యవహారాలు కూడా నిర్మాతకు, యూనిట్ కు వదిలేయడం లేదు.

అడియో ఫంక్షన్ చెన్నయ్ లో పెట్టడంతో అక్కడ కాన్సన్ ట్రేట్ చేయాల్సి వస్తోంది. మురుగదాస్ దృష్టి అంతా తమిళ వెర్షన్ మీద వుంది. దాంతో అక్కడే కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్టిల్స్ విడుదల, మిగిలిన వ్యవహారాలు తమిళంలో జరిగినట్లు తెలుగులో జరగడం లేదు.

మహేష్ బాబు ప్రచారం వ్యవహారాలు గత సినిమాలకు ఆయన భార్య నమ్రత చూసేవారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఆమె టేకప్ చేయలేదు. దీంతో తెలుగు పబ్లిసిటీ అన్నది ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. కేవలం అప్పుడు అప్పుడు ఓ స్టిల్ వదలడం, లేదా సాంగ్ వదలడం మినహా చేసింది లేదు. జైలవకుశ యూనిట్ ఏదో రూపంలో ఇప్పటికే మీడియాలోకి వచ్చింది. మరి 15 దాటితే కానీ స్పైడర్ ఆ పని చేసే అవకాశం లేదు. 

అయితే లో బజ్ లో వస్తేనే బెటర్ అని, సినిమా కంటెంట్ స్ట్రాంగ్ గా వుందని తమకు తెలుసని, కచ్చితంగా విడుదల తరువాత బజ్ ఒక్కసారిగా లేస్తుందని యూనిట్ భావిస్తోంది.