ఆయనో రెడ్డిగారు. ఉభయ రాష్ట్రాల్లో భారీ అంటే వందల కోట్ల కాంట్రాక్టులు నిర్వహించే సంస్థకు వ్యవస్థాపకుడు, యజమాని. మరి అలాంటి బడా పర్సనాలిటీ పుట్టిన రోజు అంటే అది కూడా 60వ పుట్టిన రోజు అంటే ఏ రేంజ్ లో వుంటుంది. జస్ట్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో అలాగే జరిగింది. సిటీలోని టాప్ అంటే టాప్ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి నుంచి, నిఖిల్, రాజ్ తరుణ్ వరకు అందరూ వచ్చారు. బిజినెస్, ఇండస్ట్రియలిస్ట్ ల జాబితా చెప్పనక్కరలేదు. ఏర్పాట్లు ఓ రేంజ్ లో చేసారు. స్టేజ్ మీదకు సదరు రెడ్డిగారు, సినిమాల్లో హీరో ఎంట్రీలా పై నుంచి కిందకు దిగారు.
ఇండియాలో ఆయనకు మాత్రమే వుండే కార్లు, ఇతర వాహనాలు వున్నాయి. అయినా పుట్టిన రోజు వేదికపై కార్యక్రమాలు ప్రారంభమయ్యే వరకు ఇండియాలో ఒకరిద్దరికి మాత్రం వుండే స్థాయి కేరవాన్ లో ఆయన వేచి వున్నారట. ఆయన కేరవాన్ లో రెడీ అవుతుంటే, మెగాస్టార్ చిరంజీవి సైతం వేదిక ముందు అరగంట వేచి వున్నారట.
పార్టీకి హాజరైన బడా కుటుంబాల మహిళలు పట్టుచీరలతో కనిపిస్తే, విదేశాల నుంచి వచ్చిన డ్యాన్సర్లు చిట్టి పొట్టి బట్టలతో కనువిందు చేసారు. అన్నింటికన్నా హాజరయిన జనాలకు స్టన్నింగ్ సెన్సేషన్ ఏమిటంటే, సెలబ్రిటీ పోర్నో స్టార్ సన్నిలియోన్ వేదికపై ప్రత్యక్షమై డ్యాన్స్ చేయడం. సన్నీలియోన్ వేదికపై ప్రత్యక్షం కాగానే అందరూ ఆశ్చర్యపోయారని పార్టీకి హాజరైన ఓ సినిమా సెలబ్రిటీ తెలిపారు.
మొత్తం మీద రెడ్డి గారి షష్టి పూర్తి బర్త్ డే పార్టీ సిటీ హై ఫై సర్కిళ్లలో కొద్ది రోజుల పాటు చెప్పుకునే రేంజ్ లో జరిగిందట. వేల కోట్ల ఆస్తి పరుడు, వేల కోట్ల టర్నోవర్ వున్న వ్యాపారవేత్త, స్వంత గోల్ఫ్ మైదానం వున్న వ్యక్తి పుట్టిన రోజు ఆ రేంజ్ లో జరగడంలో ఆశ్చర్యం ఏముంది?