తెలుగులో సూపర్ హిట్ అయిన నిన్ను కోరి సినిమా బాలీవుడ్ లోకి వెళ్తోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాకు మాటలు రాయడమే కాకుండా, నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు కోన వెంకట్. ఆయనతో కలిసి నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాను బాలీవుడ్ టాప్ డైరక్టర్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ చూసారట.
ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అలా రీమేక్ చేస్తే, తాము కూడా భాగస్వాములు అవుతామని డివివి దానయ్య, కోన వెంకట్ చెప్పారట. దానికి భన్సాలీ ఓకె అన్నట్లు తెలుస్తోంది.
వరుణ్ ధావన్ ను హీరోగా భన్సాలీ సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మెటీరియలైజ్ కావడానికి టైమ్ పడుతుంది. ఎందుకంటే ఇంకా వరుణ్ థావన్ సినిమాను చూడాలి. ఓకె అనాలి. అప్పుడు ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. తెలుగులో ఈ ప్రాజెక్టు మీద కోన, దానయ్య చెరో అయిదు కోట్లు లాభం చేసుకున్నారు. మరి హిందీలో చేస్తే ఏమేరకు లాభాలు చేసుకుంటారో చూడాలి.