హరితేజకు సూపర్ చాన్స్?

హరితేజ టీవీ సీరియళ్ల మాట ఎలా వున్నా, సినిమాల్లోకి అ..ఆ సినిమాతో దూసుకువచ్చింది. క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్. కీలకమైన పాత్రను ఆమెకు ఇచ్చినందుకు. ఇప్పుడు హరితేజ బిగ్ బాస్ లో కూడా ప్రేక్షకులను…

హరితేజ టీవీ సీరియళ్ల మాట ఎలా వున్నా, సినిమాల్లోకి అ..ఆ సినిమాతో దూసుకువచ్చింది. క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్. కీలకమైన పాత్రను ఆమెకు ఇచ్చినందుకు. ఇప్పుడు హరితేజ బిగ్ బాస్ లో కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

ఆ విధంగా హీరో ఎన్టీఆర్ అభినందనలు కూడా అందుకుంటోంది. బిగ్ బాస్ లో చివరి వరకు వుంటుందా? వుండదా? అన్న సంగతి అలా వుంచితే త్వరలో స్టార్ట్ కాబోయే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాలో ఓ మాంచి పాత్రను హరితేజ కోసం రెడీ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హరితేజకు త్రివిక్రమ్ మరో సారి ఛాన్స్ ఇవ్వడం విశేషం కాదు. ఎందుకంటే అ..ఆ సినిమాలో చాన్స్ ఇస్తే, బాగానే చేసి ప్రూవ్ చేసుకుంది. అయితే ఎన్టీఆర్-త్రివిక్రమ్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో కీలక పాత్ర అంటే మాత్రం విశేషమే.

ఇటు త్రివిక్రమ్ కు, అటు ఎన్టీఆర్ కు తనపై నమ్మకం పెంచుకోగలిగిందన్నమాట హరితేజ. ఎన్టీఆర్ సినిమాలో కీలకపాత్ర దొరికి, సక్సెస్ కొట్టాలి.. అక్కడితో హరితేజ కెరీర్ తారాజువ్వలా దూసుకుపోతుంది. అది మాత్రం గ్యారంటీ.