డైమండ్ రత్నం ఆ కథ బయటకు తీసారు

కథకుడు డైమండ్ రత్నం డైరక్టర్ గా మారడానికి ఓ కథ తయారు చేసుకున్నారు. కాస్త సైన్స్ టచ్ వున్న కథ. మెదడులో ఓ పార్ట్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ వుంటుంది. మనిషి ఆలోచనలు ఫాలో…

కథకుడు డైమండ్ రత్నం డైరక్టర్ గా మారడానికి ఓ కథ తయారు చేసుకున్నారు. కాస్త సైన్స్ టచ్ వున్న కథ. మెదడులో ఓ పార్ట్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ వుంటుంది. మనిషి ఆలోచనలు ఫాలో కాదు. అయితే ఆ మధ్య నాగచైతన్య-చందు మొండేటి సినిమా స్టార్ట్ చేసినపుడు దీని గురించే మల్లగుల్లాలు జరిగాయి. తన కథ కాపీ కొట్టారనో, తనదే ఆ కథ అనో డైమండ్ రత్నం అభ్యంతరం చెప్పడం, దానిమీద పంచాయతీలు జరగడం ఆఖరికి సెటిల్ మెంట్ తో వ్యవహారం ముగిసింది. ఎంతకు సెటిల్ అందిందన్నది బయటకు రాలేదు.

కట్ చేస్తే, ఇప్పుడు తన దగ్గర వున్న కథతో డైమండ్ రత్నం సినిమా డైరక్షన్ చేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా టైటిల్ బుర్రకథ. అక్కడే అర్థం అయిపోతోంది కదా కాన్సెప్ట్. సరైన బ్రేక్ కోసం చూస్తున్న ఆది సాయికుమార్ ఈ సినిమాలో హీరో.

ఈనెల ప్రారంభమయ్యే ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీత దర్శకుడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్.