శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా స్టార్ట్ అయి చాలాకాలం అయింది. దాదాపు ఫస్ట్ కాపీ రెడీ అయినట్లే. కానీ విడుదల మాత్రం ఇప్పుడే కాదని తెలుస్తోంది. మే నెలాఖరు అని ముందుగానే అనుకున్నారు కానీ, ఏకంగా జూలై అయిదుకు వాయిదా పడిపోయినట్లు తెలుస్తోంది.
జూన్ నెల స్కూళ్లు, వ్యవహారాలు, అలాగే క్రికెట్ కారణంగా జూలైలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా టైటిల్ సమస్య అలాగే కొనసాగుతున్నట్లు బోగట్టా. ఆది నుంచీ ఈ సినిమాకు దళపతి అని టైటిల్ అనుకుని, అది కుదరక వేరే టైటిళ్లు చాలా ఆలోచించారు.
కానీ అవి కూడా ఏదీ సరిగ్గా సెట్ కాలేదు. పార్థు, వ్యూహం, రణరంగం ఇలా అనేకం ఆలోచించారు. మళ్లీ ఇప్పడు దళపతి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్. అతి త్వరలో చిన్న వీడియో బైట్ తో టైటిల్ అనౌన్స్ మెంట్ వుండే అవకాశం వుంది.