బిగ్ బాస్ సీజన్ మూడుకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వుంటారని మూడునెలల క్రితమే వెల్లడించింది గ్రేట్ ఆంధ్ర. ఈ మేరకు డిస్కషన్లు ఆరంభమయ్యాయని మార్చిలోనే వార్తలు అందించింది. ఇప్పడు అది పక్కా అయింది. ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వుండి మంచి మార్కులు సంపాదించడం కాక, ఓ బెంచ్ మార్క్ సెట్ చేసారు.
దాంతో సీజన్ 2కి హొస్ట్ గా వచ్చిన నానికి చాలా ఇబ్బంది అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ తప్పలేదు. దాంతో ఇక ఆయన పక్కకు తప్పుకున్నారు. ఎన్టీఆర్ కు ఆసక్తివున్నా రాజమౌళి సినిమాతో కుదరడంలేదు. దాంతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన నాగ్ నే మళ్లీ ఆప్షన్ అయ్యారు.
ప్రస్తుతం మన్మధుడు 2 షూటింగ్ కోసం విదేశాల్లో వున్న నాగ్ త్వరలో ఇక్కడకు రాగానే అగ్రిమెంట్ ఫైనల్ అవుతుంది. ప్రయిమరీగా నాగ్ ఓకె అన్నారు. కానీ ఇతరత్రా వ్యవహారాలు అన్నీ డిస్కషన్ పెండింగ్ లో వుంది. అవి అయిపోతే, అఫీషియల్ గా త్వరలో అనౌన్స్ మెంట్ వస్తుంది.