cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సెవెన్.. వన్ మోర్ ఇన్వెస్టిగేషన్

సెవెన్.. వన్ మోర్ ఇన్వెస్టిగేషన్

చిన్న సినిమాలు అంటే థ్రిలర్ జోనర్ అన్నది సేఫ్ బెట్. గతంలో కొన్ని సినిమాలు చేసిన హీరో హవీష్ కోనేరు చేస్తున్న లేటెస్ట్ సినిమా 7. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. ఒకరు నేరస్థుడు అనే దిశగా పరిశోధన సాగడం, అది వేరే మలుపు తీసుకోవడం వంటి ఇన్ వెస్టిగేటివ్ సబ్జెక్ట్ తో సినిమా సాగినట్లు ట్రయిలర్ క్లియర్ గా వెల్లడిస్తోంది. 

థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ కు తోడు మాంచి రొమాంటిక్ మూవ్ మెంట్స్ కూడా సినిమాలో బాగానే దట్టించినట్లు కనిపిస్తోంది. హవీష్ కెరీర్ లో ఇప్పటివరకు బ్రేక్ ఇచ్చేంత హిట్ లు రాలేదు. ఈ సినిమా మీద కాస్త హోప్స్ వున్నాయి. ట్రయిలర్ కూడా కాస్త ఆసక్తికరంగానే వుంది. సీనియర్ నటుడు రెహమాన్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. నందిత, రెజీనా తదితరులు నటించారీ సినిమాలో. ట్రయిలర్ ఆర్ ఆర్ బాగుంది. 

ట్రయిలర్ రాక ముందే అభిషేక్ నామాకు చెందిన అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను అవుట్ రేట్ కు కొనేయడం విశేషం.