Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అక్టోబర్ 2 సైరా ఫిక్స్?

అక్టోబర్ 2 సైరా ఫిక్స్?

సమ్మర్ సీజన్ హడావుడి మహర్షి సినిమాతో ఓ కొలిక్కి వచ్చింది. ఇక మిగిలినవి మీడియం, చిన్న సినిమాలే. అది కూడా జూన్ లో పెద్దగా హడావుడి వుండదు. ఎందుకంటే స్కూళ్లు, పుస్తకాలు, వరల్డ్ కప్. అందువల్ల పోస్ట్ సమ్మర్ లో కాస్త హడావుడి వుంటుంది. పెద్ద సినిమాలకు ఇక మిగిలిన టార్గెట్ దసరానే.

ఇప్పుడు అందరి దృష్టి సైరా మీద వుంది. ఎందుకంటే సైరాకు దసరా కాకపోతే, సంక్రాంతినే మిగిలింది. పొరపాటున సైరా సంక్రాంతికి వస్తాను అంటే చాలా ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటి నుంచే సంక్రాంతి టార్గెట్ గా బోలెడు సినిమాలు రెడీ అవుతున్నాయి.

మహేష్-అనిల్ రావిపూడి, బన్నీ-త్రివిక్రమ్, మారుతి-సాయితేజ్, నాగార్జున-కళ్యాణ్ కృష్ణ సినిమాలు అలాగే బాలయ్య సినిమా ఒకటి, శర్వానంద్ సినిమా ఒకటి ఇలా చాలా సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతున్నాయి. అయ్యే ప్రయత్నంలో వున్నాయి. సైరా కనుక దసరాకు రాకుండా సంక్రాంతికి వస్తే, ఇవన్నీ చెల్లా చెదురు అయిపోతాయి.

అందుకే ఎవరికీ ఇబ్బందిలేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు రావాలని సైరా గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా. అక్టోబర్ 2న డేట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2 బుధవారం. గురువారం నుంచి దసరా హడావుడి స్టార్ట్ అవుతుంది. అందువల్ల వారంరోజులు వరుసగా కలిసి వస్తాయన్నది ఆలోచనగా వుంది.

ఆగస్టులో సాహో, అక్టోబర్ లో సైరా అనుకున్నవి అనుకున్నట్లుగా వచ్చేస్తే, మిగిలిన సినిమాలకు ఏ సమస్య వుండదు. అలాకాకుండా వీటి డేట్ లు మారితే మాత్రం అంతా గందరగోళమే.

బాలకృష్ణ..ఎమ్మెల్యేగా గెలవాలంటే అదే జరిగుండాలి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?